మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు

ఉద్యమానికి గట్టి ఎదురు దెబ్బ;

Update: 2025-07-17 06:31 GMT

తెలంగాణలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. జన నాట్య మండలి వ్యవస్థాపకులు సంజీవ్, అతని భార్య దీనా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు నేతలను గురువారం మధ్యాహ్నం మీడియా ముందు హాజరుపరిచారు. వీరిద్దరు గత రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో ఉన్నారు.

జన నాట్యమండలి వ్యవస్థాపకులలో ఒకరైన గద్దర్ తో పాటు సంజీవ్ ఉన్నారు. ఆయన భార్య దీనా దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రెటరీ హోదాలో పని చేశారు.

తెలుగు నేలపై తన సాంస్కృతిక  ఉద్యమ ప్రభంజనంతో ప్రజల చైతన్యాన్ని పరవళ్ళు తొక్కించి రెండు తరాలను ప్రభావితం చేశారు.  జననాట్య మండలి వ్యవస్థాపకులు లొంగిపోవడం అంటే మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. గాయకుడు సాంస్కృతికోద్యమ నాయకుడు అయిన కామ్రేడ్ సంజీవ్ ఈ కాలంలో సరి కొత్త రూపంలో తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం గానం చేస్తూ నక్సల్బరీ ఉద్యమాన్ని బలో పేతం చేశాడు. ఆయన పాటలకు స్పూర్తి చెంది యువత నక్సల్బరీ ఉద్యమంలో అడుగు పెట్టారు. ప్రస్తుతం వున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ప్రజలు నిరాశ చెందవద్దని, కనీసం ప్రజాస్వామ్య హక్కులు మృగ్యమైన ఈ పరిస్థితుల్లోప్రజలు నిరాశ చెందవద్దని పొరు దప్ప మరో దారి లేదనీ స్పష్టమైన సందేశంతో... ‘‘సాగిపోదమా మనం కల్సి పోదమా ’’అంటూ ఆయన పాడిన పాట ఎవరూ మర్చిపోలేరు.

Tags:    

Similar News