తెలంగాణలో మరో రెండు కొత్త దగ్గు సిరప్ లపై నిషేధం
రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ దగ్గు మందులపై బ్యాన్
నిషేధిత దగ్గు మందుల జాబితాలో మరో రెండు దగ్గుమందులు చేరాయి. ఈ రెండు దగ్గు మందులను నిషేధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ దగ్గుమందులను ఇక విక్రయించకూడదు అంటూ అందులో పేర్కొంది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించారు. వీటిని గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా పేర్కొన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్‌రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ మందును సిఫారసు చేసిన మధ్య ప్రదేశ్ చింద్వారా జిల్లాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడు కాంచిపురం జిల్లాకు చెందిన శ్రీసన్ ఫార్మా ఈ ఏడాది మే నుంచి ఈమందును తయారుచేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ‘కోల్డ్ రిఫ్’ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఔషధ నియంత్రణ విభాగం (డీసీఏ) ప్రకటించింది.
కోల్డ్ రిఫ్ లో 48 శాతం విషరసాయనాలున్నట్టు బయటపడింది.
తమిళనాడు ఫుడ్ సేప్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం గత వారం ఫార్మాస్యుటికల్ కంపెనీలో తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించింది. రాజస్థాన్, కేరళ, మధ్య ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ఈ దగ్గుమందును నిషేధించారు.