వల్లభనేని వంశీ అరెస్టు
గురువారం ఉదయం హైదరాబాదులోని ఆయన ఇంట్లోనే పోలీసులు అరెస్టుచేశారు;
పోలీసులు గన్నవరం తెలుగుదేశంపార్టీ మాజీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీని అరెస్టుచేశారు. గురువారం ఉదయం హైదరాబాదులోని ఆయన ఇంట్లోనే పోలీసులు అరెస్టుచేశారు. దాదాపు రెండేళ్ళక్రితం గన్నవరం(Gannavaram) టీడీపీ(TDP) ఆపీసుమీద జరిగిన దాడిఘటనకు బాధ్యుడని వంశీపై పోలీసులు కేసు నమోదుచేశారు. దాడి ఘటనలో వంశీ(Vallabhaneni Vamsi)తో పాటు మరో 40 మందిపైన కూడా పోలీసులు కేసులు నమోదుచేశారు. దాడిఘటన కాకుండా ఇంకేవైనా కేసులున్నాయా అన్న విషయాన్ని పోలీసులే చెప్పాలి. తాజా అరెస్టు ఏ కేసుకు సంబంధించి అన్న విషయంపై పోలీసులు క్లారిటి ఇవ్వలేదు. 2019లో టీడీపీ తరపున గెలిచిన వంశీ తర్వాత చంద్రబాబునాయుడు(Chamndrababu)తో విభేదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి(Jaganmohan reddy)కి దగ్గరైన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాదులో అరెస్టుచేసిన వంశీని పోలీసులు విజయవాడకు తీసుకుని వెళుతున్నారు.