కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా ?

కేసీఆర్ తన మెడకు తానే తాడును బిగించుకున్నట్లయ్యింది;

Update: 2025-08-29 08:29 GMT
KCR and Kaleshwaram Project

ఇపుడిదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఒక సమస్య రాకపోతే మరో సమస్య. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం(Kaleshwaram Report)రిపోర్టు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల(BC Reservations) అంశాలే కీలకంగా ఉండబోతున్నాయి. కాళేశ్వరం అవినీతి, అవకతవకల్లో ఆరోపణలన్నీ కేసీఆర్(KCR) మీదే ఉన్నాయి. తర్వాత పాత్ర మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao)ది. అసెంబ్లీ సమావేశాల్లో జస్టిస్ పీసీ ఘోఫ్ రిపోర్టును చర్చకు పెట్టబోతోంది ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం. ఘోఫ్ రిపోర్టును కాపీలు తీసి సభ్యులందరికీ ప్రభుత్వం అందించబోతోంది. తర్వాత కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణంలో కేసీఆర్, హరీష్ పాల్పడిన అవినీతి, అవకతవకలపై సుదీర్ఘమైన చర్చ ఉంటుంది. రిపోర్టును అసెంబ్లీలో(Telangana Assembly) చర్చకు పెట్టగానే వెంటనే అదే రిపోర్టును వెబ్ సైట్ లో పెట్టి పబ్లిక్ డాక్యుమెంటు చేయబోతోంది. ప్రభుత్వ చర్యలను అడ్డుకునేందుకే కేసీఆర్, హరీష్ వేర్వేరుగా హైకోర్టులో పిటీషన్లు వేశారు. అయితే వీరి వాదనను కోర్టు కొట్టేసింది.

ఎందుకు కొట్టేసిందంటే రిపోర్టు కాపీలను అసెంబ్లీలో సభ్యులందరికీ పంపిణీ చేస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసెంబ్లీలో సభ్యులు కాబట్టి రిపోర్టులోని అంశాలపై కేసీఆర్, హరీష్ తమ వాదనలను తాము వినిపించవచ్చని ప్రభుత్వం కోర్టులో వాదించింది. రిపోర్టుపై సభ్యులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే బాధ్యులపై ఏమి చర్యలు తీసుకోవాలో నిర్ణయం జరుగుతుందని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు కేసీఆర్, హరీష్ వాదనను తోసిపుచ్చింది. ఏమి చెప్పుకోవాలన్నా సభ్యులు కాబట్టి అసెంబ్లీలోనే చెప్పుకోమని చెప్పిన కోర్టు కేసును నాలుగు వారాలు వాయిదావేసింది.


హాజరవుతారా ? కారా ?


ఇపుడు సమస్య ఏమిటంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా ? రారా ? అన్నదే. అసెంబ్లీకి హాజరుకాకపోతే కాళేశ్వరం రిపోర్టుపై జరిగే చర్చలో కేసీఆర్ తన వాదనను వినిపించలేరు. ఒకవేళ హరీష్ రావు తన వాదనతో పాటు కేసీఆర్ వాదనను కూడా వినిపిస్తానంటే రేవంత్ ప్రభుత్వం అంగీకరించదు. ఎందుకంటే జరిగిన అవినీతి, అవకతవకలన్నీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్ణయాల వల్లే జరిగిందని రేవంత్, మంత్రులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలను సమర్ధించుకోవాలంటే అసెంబ్లీకి కేసీఆర్ తప్పక హాజరై తన వాదన వినిపించాల్సిందే కాని హరీష్ సమర్ధించేందుకు లేదు. ఒకవేళ సభకు హాజరుకాకపోతే అది రెండు రకాలుగా కేసీఆర్ కే నష్టం. మొదటిది అసెంబ్లీ చర్చలో కేసీఆర్ తన వాదనను వినిపించలేరు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, వాదనే జనాల్లోకి బలంగా వెళుతుంది.


కేసీఆర్ కు రెండు నష్టాలు


రెండో నష్టం ఏమిటంటే నాలుగువారాల తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ గైర్హాజరు విషయాన్ని ప్రభుత్వం హైలైట్ చేస్తుంది. కోర్టు చెప్పినా కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేదని ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది. దాంతో కోర్టులో కేసీఆర్ ఎంత వాదించినా వాదన బలంగా నిలబడదు. ఇదేసమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులు గోలచేస్తే దాన్ని కూడా ప్రభుత్వం కోర్టులో చెబుతుంది. కాళేశ్వరం అంశాన్ని సభలో చర్చకు రానీయకుండా బీఆర్ఎస్ సభ్యులు చేసిన గొడవను చూపిస్తుంది. తన వాదనకు మద్దతుగా ప్రభుత్వం ఆడియో, వీడియో విజువల్సును కూడా కోర్టుకు అందిస్తుంది. అసెంబ్లీలో జరిగే వ్యవహారాలు కోర్టు విచారణలో ప్రతిఫలించటం ఖాయం. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాక, కాళేశ్వరం రిపోర్టుపై సభలో చర్చనూ జరగనివ్వకపోతే అది తనకే నష్టం. కోర్టులో పిటీషన్ వేయటం ద్వారా కేసీఆర్ తన మెడకు తానే తాడును బిగించుకున్నట్లయ్యింది. అందుకనే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా ? కారా ? అన్నది ఉత్కంఠగా మారింది.

ఇక అసెంబ్లీలో రెండో కీలకమైన అంశం బీసీలకు 42శాతం రిజర్వేషన్. దీన్ని బీఆర్ఎస్ కన్నా బీజేపీనే ఎక్కువగా వ్యతిరేకిస్తోంది. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటు బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తోంది. బీసీల రిజర్వేషన్ బిల్లులో ముస్లింలను చేర్చటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే పై రెండుపార్టీలు అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు తమదైన శైలిలో ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఎర్రవల్లి ఫామ్ హౌసులో కేసీఆర్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతోను, రామచంద్రరావు బీజేపీ ఆఫీసులో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో ఇదే విషయమై సమావేశాలు నిర్వహించారు. శనివారం మొదలయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగురోజులు జరిగే అవకాశముంది.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలైన తర్వాత వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో బీఏసీ మీటింగ్ జరుగుతుంది. ఆ సమావేశంలోనే అసెంబ్లీ ఎన్నిరోజులు జరగాలనే విషయం ఖరారవుతుంది. అలాగే సభలో ప్రవేశపెట్టబోయే అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఈ దశలోనే కాళేశ్వరం రిపోర్టు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశాలపై వాగ్వాదాలు జరిగే అవకాశాలను తోసిపుచ్చేందుకు లేదు. ఎందుకంటే రిపోర్టుపై అసెంబ్లీలో అసలు చర్చే జరగకూడదని, సభ్యులకు రిపోర్టు కాపీలను పంపిణీ చేయకూడదన్నది కేసీఆర్, హరీష్ వాదన. కాళేశ్వరంపై సభలో చర్చ జరిగితే కాంగ్రెస్ లేదా మెజారిటి సభ్యుల వాదనకు బీజేపీ మద్దతిచ్చే అవకాశాలున్నాయి. అలాగే బీసీ రిజర్వేషన్ అంశంపై జరిగే చర్చలో బీజేపీ వ్యతిరేకించినా మెజారిటి సభ్యులు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమావేశాలు మొదలైన తర్వాత సభలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

ఈ సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చలు జరుగుతాయి. అవేమిటంటే మొదటిది కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చ. రెండో అంశం ఏమిటంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్. పై రెండు అంశాల్లో కాళేశ్వరంపై ఘోష్ రిపోర్టును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను వేధించటానికే ప్రభుత్వం జస్టిస్

Tags:    

Similar News