కీలక మలుపు తిరిగిన ఐఏఎఫ్ అధికారిపై దాడి కేసు

వింగ్ కమాండరే మొదట దాడి చేసినట్లు తేల్చిన పోలీసులు;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-22 07:33 GMT
వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్

బెంగళూర్ లో ఐఏఎఫ్ అధికారిపై దాడి జరిగిందన్న విషయం కీలకమలుపు తిరిగింది. ఈ కేసులో వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూర్ లో ఒక రోడ్ లో వెళ్తుంటే కొంతమంది దుండగులు బైక్ పై వెంబడించి మాపై దాడి చేశారని వింగ్ కమాండర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడికి సంబంధించిన సీసీఫుటేజీ, ఘర్షణ జరుగుతున్నప్పుడు వీడియో తీసిన సాధారణ ప్రజలు నుంచి సమాచారం సేకరించిన పోలీసులు వింగ్ కమాండర్ పై కూడా కేసు నమోదు చేశారు.

నిన్న ఉదయం బెంగళూర్ లో తాను, తన భార్య వెళ్తుంటే బైక్ పై కొంతమంది వెంబడించారని, వారంతా తన భార్యను అవమానించి కన్నడలో దూషించినట్లు శిలాదిత్య బోస్ ఒక వీడియోలో ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై సాప్ట్వేర్ కంపెనీ కాల్ సెంటర్ లో టీమ్ హెడ్ గా పనిచేస్తున్న వికాస్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలో లభించిన సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియో రికార్డులను పరిశీలించిన సందర్బంగా శిలాదిత్య బోస్ ఈ దాడి ప్రారంభించినట్లు తేలింది. అతను మొదట నిందితులపై దాడి చేసి కఠినంగా శిక్షించాడని తేలింది.
ఈ సందర్భంగా రెండు బృందాలు ఒకరిపై ఒకరు బహిరంగంగా దాడి చేసుకున్నారు. ఐఏఎఫ్ అధికారిని అతని భార్య ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అతను ఎవరి మాట వినకుండా దాడి చేశాడు. ఈ ఘటన నగరంలోని టీన్ ఫ్యాక్టరీ జంక్షన్ సమీపంలో జరిగింది.
భాషా ఆధారిత గొడవలుగా చిత్రీకరణ..
వింగ్ కమాండర్ విడుదల చేసిన వీడియో ప్రకారం..ఇది కన్నడ భాషకు సంబంధించిన వివాదంగా చెప్పాడు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడి నుదుటి నుంచి రక్తం కారుతున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో హైలెట్ అయ్యాయి. తనతో పాటు తన భార్యపై కనికరం లేకుండా దాడి చేశారని ఆయన ఆరోపించారు.
తాము కారులో వెళ్తుంటే బైక్ లో వెంబడించిన దుండగుడు రోడ్ పై ర్యాష్ డ్రైవింగ్ చేశాడని, అతడిని తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పుడు కారు ఎదురుగా మెటార్ సైకిల్ ఆపి దాడికి ప్రయత్నించాడని వీడియోలో ఆరోపించారు.
రాయి, బైక్ కీతో దాడి చేసేందుకు ప్రయత్నించాడని అన్నారు. అయితే పోలీసులు వింగ్ కమాండర్ వాదనను ఖండించారు. ఇది రోడ్ మీద జరిగిన ఒక ఘర్షణ అని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాద ఘటన..
భార్యభర్తలు ఇద్దరు డీఆర్డీఓ ఉద్యోగులు. కార్యాలయం నుంచి బెంగళూర్ విమానాశ్రాయానికి వెళ్తున్న సందర్భంగా ఓ వ్యక్తి దాడి చేసినట్లు అతని భార్య దత్తా(స్క్వాడ్రన్ లీడర్) బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వీరి కథనం ప్రకారం.. కార్ డోర్ తెరుస్తున్న సందర్భంగా ప్రమాదవశాత్తూ ఒక బైకర్ కార్ ను ఢీ కొట్టాడు. తరువాత వారి మధ్య వాగ్వాదం పెరిగి శారీరక హింసకు దారితీసింది.
నిందితుడు అదుపులో ఉన్నాడని తమ వద్ద చాలా వీడియో ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తును కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News