తమిళనాడు బడ్జెట్ లో హిందీ ₹ గల్లంతు
బడ్జెట్ సందర్బంగా రుపాయి తమిళ లోగో విడుదల చేసిన డీఎంకే సర్కార్;
జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ, హిందీపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్న తమిళనాడు తాజాగా మరో అడుగు ముందుకేసింది. రూపాయికి బదులుగా ప్రస్తుతం వాడుతున్న దేవనాగరి లిపిలో ఉన్నసింబల్ కు బదులుగా తమిళ భాషలోని ‘రుబాయి’ లోని ‘రు’ సింబల్ వాడాలని నిర్ణయించుకుంది.
డీఎంకే ప్రభుత్వం గురువారం 2025-26 బడ్జెట్ ను లోగోను విడుదల చేసింది. ఈ సందర్భంగా తమిళనాడు కొత్త రూపాయి లోగోను విడుదల చేసింది. ఇందులో దేవనాగరి లిపిలోని సింబల్ కు బదులు తమిళభాషలోని అక్షరాన్ని వాడింది.
ఇది స్థానిక భాషలో భారతీయ కరెన్సీని సూచిస్తుంది. అలాగే లోగోపై ‘‘అందరికి ప్రతిదీ’’ అనే శీర్షికను సైతం విడుదల చేసింది. ఇది డీఎంకే తన సమ్మిళిత పాలన నమూనాను తెలియజేసే విధంగా ఇది రూపొందించారు. తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు శుక్రవారం 2025-26 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.