మేమే రామభక్తులం.. లేదు మేమే: ఆ రెండు రాజకీయ పార్టీల వార్

త్వరలో అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.

Update: 2024-01-09 13:13 GMT

మరోవైపు ఊరురా రామ్ జన్మభూమికి సంబంధించిన అక్షింతల వితరణ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపిణీ చేసే పనిని హిందూసంఘాలు ఉధృతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో క్రెడిట్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. బీజేపీ- కాంగ్రెస్ మేమే నిజమైన రామ భక్తులమంటే.. కాదు మేమే నిజమైన భక్తులమని మాటల యుద్దానికి దిగుతున్నాయి.

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలు హిందూ ఓటర్లను ఆకట్టుకునే పనిని ప్రారంభించాయని అర్ధమవుతోంది. గత ఏడాది గద్దే దిగిన బీజేపీ, ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని మరోసారి నరేంద్ర మోడీని ఢిల్లీ సింహసనాన్ని అందించాలని కన్నడ కమలనాథులు కోరుకుంటున్నారు.

అందుకే అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఇంటికి తిరగుతున్న సంఘ్ పరివార్ కార్యకర్తలు అయోధ్య అక్షింతలతో పాటు ఆలయ ఫొటోలు, రామమందిర విశిష్టతలను తెలిపే కరపత్రాన్ని సైతం అందిస్తున్నారు. ప్రజలు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి వీటిని తీసుకోవాలని చెబుతున్నారు. దీనిని ఒక ఆచారంగా ప్రచారం చేస్తున్నారు.

సంఘ్ కార్యకర్త రామ్ భట్ ఇలా అన్నారు. " ప్రజలు మేము ఇచ్చిన వాటిని భక్తిభావంతో తీసుకుంటున్నారు. అక్షింతలను పూజ గదిలో పెట్టుకుని, జనవరి 22 వరకు పూజిస్తారు. తరువాత వాటిని ప్రసాదంగా భావించి ఖీర్ తో కలపవచ్చు, అయితే వాటిని పూజించే సమయంలో ఉత్తరాభిముఖంగా ఉండాలి" అని చెప్పారు. రామమందిరం ఇక్కడి నుంచి ఉత్తరం వైపే ఉందని వివరించారు.

ఈ ప్రచారాన్ని పసిగట్టిన కాంగ్రెస్ నాయకత్వం కాషాయపార్టీపైకి ఎదురుదాడికి దిగింది. బీజేపీ చేస్తున్న ప్రచారం పనిచేయదని చెబుతూనే.. జనవరి 22న రామమందిరం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని తమ కేడర్ కు పిలుపునచ్చింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు ప్రారంభం అయి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయని మంత్రి రామలింగారెడ్డి చెప్పారు.

"బీజేపీ వాళ్లు నకిలీ హిందువులం, మేమే నిజమైన హిందువులం, రాజకీయాల కోసం బీజేపీ దేవుళ్లని వాడుకుంటోంది" అని అన్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కార్యకర్త ఫెడరల్ తో మాట్లాడారు. " మేము రామమందిరానికి వ్యతిరేకం కాదు, కానీ లౌకిక వాదాన్ని నమ్ముతాం" అని అన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి మాత్రం వ్యూహత్మకంగా వ్యవహరించాలని అని అన్నారు.

ఈ విషయంలో సీఎం సిద్దరామయ్య కూడా రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. "దేవాలయానికి మా మద్ధతు ఉంది" అని చెబుతున్నారు. మా పార్టీలో అన్ని మతాల వారు ఉన్నారని, కానీ తాము ఎవరిని బలవంతం చేయమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాట. రామమందిరానిని నేను కూడా విరాళం ఇచ్చాను . ఇదీ నా వ్యక్తిగతం అని హోమంత్రి డి పరమేశర చెబుతున్న మాట. సంఘ్ పరివార్ కర్నాటక లో ఉన్న పేదలకు కూడా ఇలాగే బియ్యం పంపిణీ చేస్తే పేదరికం తగ్గేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

అయితే రెండు పార్టీలు అనుసరిస్తున్న మతవైఖరిని పలువురు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. "దేశంలో ఎన్నోరకాల మతాలు ఉన్నాయి, వందల జాతులకు చెందిన వందలాదీ పూజ విధానాలు ఉండగా ఏకకాలంలో అన్ని దేవాలయాల్లో ఓకే దేవుడిని పూజించడం ఏమిటి" అని రచయిత నవీన్ సూరింజే ప్రశ్నించారు. మరో సామాజిక కార్యకర్త రామే గౌడ మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న అన్నమ్మ దేవాలయాలను ప్రస్తావించారు. " శ్రీరామమందిరం తెరవడానికి, అన్నమ్మ, చౌడేశ్వరి మధ్య సంబంధం ఏమిటీ? రాష్ట్రం తీవ్రమైన కరువును ఎదుర్కొంటూ ఉండగా రాజకీయ పార్టీ ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడం తగదు" అని చురకలు అంటించే ప్రయత్నం చేశారు.

ఏదీఏమైనా రామమందిర నిర్మాణం అనేది హిందూ ఓటర్ల ను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రచారంగా వాడుకోవడం వచ్చే లోక్ సభ ఎన్నికలను ఏ మలుపుతిప్పుతుందో చూడాలి.

Tags:    

Similar News