తిరుమల: జగన్ పై ఆంక్షలంటే సనాతన ధర్మాన్ని అడ్డుకోవడమేనా..
తిరుమల శ్రీవారిని జగన్ దర్శనం చేసుకునే వెళతారు. పార్టీ నేతలను గృహ నిర్బంధం చేయడాన్ని వైసీపీ ఆక్షేపించింది. ఈ వ్యవహారాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఏమన్నారంటే..
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే వెళతారు. జిల్లాల నుంచి వస్తున్న వారిని నిర్బంధించడాన్ని వైసీపీ తప్పుబట్టింది. "ఎంతగా అణిచితే అంతగా పైకి లేస్తాం" అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. వైసీపీ అధ్యక్షుడు "వైఎస్. జగన్ తిరుమల శ్రీవారిని దర్శించునే వెళతారు. అందులో ఎలాంటి సందేహం లేదు" అని కూడా ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
"తిరుమలకు రాకుండా వైసీపీ అధినేత వైఎస్. జగన్ ను అడ్డుకోవడం అంటే సనాతన ధర్మాన్ని అడ్డుకోవడమే. సంస్కృతిని దెబ్బతీయడమే" అని ఆయన అభివర్ణించారు. జగన్ అంటే బీజేపీకి అంతభయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తిరుమల లడ్డూ లో కల్తీ జరిగిందనే ఆరోపణల ప్రకంటనలు ఆగడం లేదు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని మాజీ సీఎం వైఎస్. జగన్ కార్యక్రమం కూడా ఖరారైంది. దీనికి టీడీపీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. సాధువులు కూడా వైఎస్. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి తిరుపతిలో మోహరించారు.