తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

14న రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ;

Update: 2025-07-11 13:14 GMT

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఎప్పుడు ఎప్పుడూ అని ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న సూర్య పేట జిల్లా తుంగతుర్తినియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. కొత్తగా 2. 4 ల క్షల మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే రేషన్ కార్డు కంపల్సరీ.


Tags:    

Similar News