షా ఫేక్ వీడియో కేసులో 16 మంది అరెస్టు

సాంకేతికత ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుందనడానికి షా డీప్ ఫేక్ వీడియోనే సాక్ష్యం. వాటిని సర్క్యులేట్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-04-30 10:02 GMT

కేంద్ర హోం మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ తో పాటు మరో 16 మందిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

బీజేపీ ముంబై కార్యకర్త ప్రతీక్ కర్పే సోమవారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో షా ఫేక్ వీడియో గురించి ఫిర్యాదు చేశారు.బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతిసేందుకు కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే ఇలాంటి ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారని, వీటిని సర్కులేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి, తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పిస్తామని షా తన అసలు ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే

నకిలీ వీడియోలో షా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పినట్లు చూయించారు. అలా తయారుచేసిన ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు.. మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్‌తో పాటు డీప్‌ఫేక్ వీడియోను షేర్ చేసిన మరో 16 మందిపై బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News