ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నవి.. అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఆయన గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు.

Update: 2024-03-15 15:17 GMT

గాంధీనగర్ లోక్‌సభకు నామినేట్ అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం (మార్చి 15) తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇవి తమ పార్టీ కోసం జరుగుతున్న ఎన్నికలు కాదని, దేశం కోసం జరుగుతున్నవని ప్రతి బీజేపీ కార్యకర్త ఓటర్లందరికి చెప్పాలని కోరారు.

ఈ లోక్‌సభ ఎన్నికల ప్రధాన అంశం భారతదేశాన్ని గొప్పగా మార్చడమేనన్నారు. రాబోయే ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ప్రధాని మోదీ తన పదేళ్ల పదవీ కాలంలో ఉగ్రవాదం, నక్సలిజం, చొరబాటుదారులతో కఠినంగా వ్యవహరించడం వల్లే దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉందన్నారు.

ఒక్క గుజరాత్‌లోనే కాదు. ఇప్పుడు దేశమంతా మోడీ వేవ్ వీస్తుందన్నారు. "అతను (మోడీ) ఎక్కడికి వెళ్లినా..అది దక్షిణ భారతదేశం లేదా ఢిల్లీ కావచ్చు.. ప్రజలు మాత్రం ’అబ్కీ బార్, 400 పార్' (ఈసారి 400 కంటే ఎక్కువ సీట్లు) అని నినాదాలు చేస్తున్నారు’’ అని చెప్పారు.

2019 లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షా కాంగ్రెస్ అభ్యర్థి సిజె చావ్డాపై 5 లక్షల ఓట్లతో విజయం సాధించారు. అప్పట్లో గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల పంపకాల ఒప్పందం కుదుర్చుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ స్థానానికి తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

Tags:    

Similar News