కాంగ్రెస్ ఆశలు చిగురించాయా? అందుకేనా ఇండియా కూటమి ముందస్తు భేటీ!

ఎన్నికల ఫలితాలకు ముందు జూన్‌ 1న ఇండియా కూటమి అగ్ర నేతలు సమావేశం కావడంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Update: 2024-05-27 13:05 GMT

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నాయకులు సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన వెంటనే ఢిల్లీలో భేటీ కానున్నారు. జూన్ 1న ఇండియా కూటమి సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలకు ముందు జూన్‌ 1న ఇండియా కూటమి అగ్ర నేతలు సమావేశం కావడంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి కండిషన్ బెయిల్ మీదున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిహార్ జైలులో లొంగిపోవాల్సి ఉంది. మెడికల్ గ్రౌండ్స్ పై ఆయన మరోవారం పాటు బెయిల్ కొనసాగించాలని పిటిషన్ పెట్టుకున్నప్పటికీ కోర్టు అంగీకరిస్తుందో లేదో తెలియదు. అందుకనే ఓ రోజు ముందే ఈ కూటమి మీట్ అవుతున్నట్టు సమాచారం.

సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్ కూడా జూన్ ఒకటినే ముగుస్తుంది. ఆ ఎన్నికలు అయిపోయిన వెంటనే సాయంత్రం ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు సమావేశం అవుతున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగువుతుందని వార్తలు వస్తున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు, కూటమి నేతలు, ఆమ్‌ఆద్మీ పార్టీ ధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరవుతారు. ఇండియా కూటమిలో భాగంగా ఆప్, గోవా, గుజరాత్, హర్యానాల్లో కాంగ్రెస్‌తో సీట్ల భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో రెండు చోట్ల కాంగ్రెస్‌కు పోటీగా ఒంటరిగా బరిలోకి దిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి 28 మంది సభ్యులతో కూడిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా కూటమి) గత ఏడాది జులైలో ఏర్పడింది. ఎన్డీఏ కూటమి కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. ప్రధానిగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్‌ సొంతం చేసుకోవాలని మోదీ కృషి చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమయ్యాయి. ఏడు దశల్లో ఇప్పటికి ఆరు దశల పోలింగ్ జరిగింది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Tags:    

Similar News