‘జూలై 2న హాజరవ్వండి’
2018లో బెంగళూరులో జరిగిన సదస్సులో అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా కోర్టులో ఫిర్యాదు చేశారు.
By : The Federal
Update: 2024-06-26 09:52 GMT
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని దాఖలైన పరువునష్టం కేసులో జులై 2వ తేదీన తమ ముందు హాజరుకావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం బుధవారం కోరింది.
2018లో బెంగళూరులో జరిగిన సదస్సులో అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ప్రజాప్రతినిధుల కోర్టులో ఆగస్టు 4, 2018న బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా కోర్టులో ఫిర్యాదు చేశారు. దాంతో రాహుల్ గాంధీకి డిసెంబర్ 16న న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. జనవరి 18న జరిగిన విచారణలో రాహుల్ గాంధీ తరపున ఆయన న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా తొలిసారిగా కోర్టుకు హాజరయ్యారు. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 20న అమేథీలో తన "భారత్ జోడో న్యాయ్ యాత్ర"ను నిలిపివేసి రాహుల్ కోర్టుకు హాజరయ్యారు దాంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.