కేరళ ఓటర్ల తెలివైన తీర్పు

కేరళలో ఎన్నికల ఖర్చు పెంచే కొద్దీ సీట్లు తగ్గిపోతున్న వైనం కనిపిస్తుంది. డబ్బు నీళ్లలాగా ఖర్చు చేసే పార్టీని తిరస్కరించడం అక్కడ కనిపిస్తుంది. వివరాలు

Update: 2024-04-03 09:11 GMT

తిరువనంతపురం: కేరళలో భారతీయ జనతా పార్టీ ఏదో విధంగా కాలుమోపాలని చూస్తున్నది. కమ్యూనిస్టు పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన కేరళలో బిజెపి ఎంత ప్రయత్నించినా ఓటర్లు దారికి రావడంలేదు. బిజెపి నేతలు డబ్బు విపరీతంగా ఖర్చుచేస్తున్నారు. ఒక్క సీటు రావడం లేదు. కేరళలో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో (అంటే 2014 మరియు 2019) బిజెపి జేబులు ఖాళీ అయ్యాయి గాని, ఫలితం రాలేదు. భారత ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన ఖర్చు నివేదిక ప్రకారం బిజెపి రూ. 40 కోట్లకు పైగా ఖర్చు చేసింది. వచ్చిన సీట్లు శూన్యం. అయితే, ఓట్ల శాతం 10.45 శాతం నుంచి 12 శాతానికి పెరగడం ఒక్కటే ఓదార్పు. ఈ రెండు లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్‌లు కలసి కూడా బిజెపి లాగా ఖర్చు చేయలేక పోయాయి.

2019లో కేరళ మీద బిజెపి దృష్టి మరీ ఎక్కువ చేసింది. ఒక్కసారిగా బీజేపీ ఎన్నికల ఖర్చును  గత ఎన్నికల రూ. 15 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచేసింది. అంటే 66 శాతం పెరుగుదల అన్నమాట. సీపీఎం, కాంగ్రెస్ లు కూడా తమ ఖర్చులను పెంచుకున్నాయి.  బాగా తక్కువ. 2014, 2019 ఎన్నికల్లో సిపిఎం చేసిన ఖర్చు  రూ.14.6 కోట్లు కాగా, కాంగ్రెస్‌కు రూ.16.7 కోట్లు. రెండు పార్టీల ఖర్చు రు. 31 కోట్ల మించలేదు అని ఎన్నికల కమిషన్ లెక్కలు చెబుతున్నాయి.


2014లో  బిజెపి 15 కోట్ల రుపాయలు ఖర్చు చేసినా ఒక్క సీటు గెలవలేదు. అదే సిపిఎం రు.1.45 కోట్లు ఖర్చు చేసి అయిదు సీటు గెల్చుకుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రు. 1.75 కోట్లు చేసి ‘8 సీట్లు గెలిచింది.

2019 లో సిపిఎం రు. 13.6 కోట్ల ఖర్చుచేసింది. గెల్చుకున్నది ఒక్కటే సీటు. ఇక కాంగ్రెస్ పార్టీ రు. 15.2 కోట్లను మించి ఖర్చు చేయలేదు. 15 సీట్లు గెల్చుకుని రికార్డు సృష్టించింది. సీటుకు సగటు ఖర్చు కోటి  మించలేదు.


బిజెపి విషయానికి వస్తే, ఎన్నికల వ్యయాన్ని 15 కోట్ల నుంచి రు. 25న కు పెంచింది. అంటే 66 శాతం పెరుగుదల. కానీ సీట్లేమీ రాలేదు.

Tags:    

Similar News