సద్గురుకు బ్రెయిన్‌ సర్జరీ .. కోలుకుంటున్న జగ్గీ వాసుదేవ్

ఆధ్యాత్మిక‌వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు మెదడులో రక్తస్రావం జరగడంతో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.;

Update: 2024-03-20 15:34 GMT

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక‌వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాల నుంచి తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో ఆయన మెదడులో రక్తస్రావం జరిగిందని వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో ఈనెల 17వ తేదీన బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతం అయ్యిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సద్గురు కోలుకుంటున్నారని చెప్పారు.

అపోలో ఆసుపత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరి సర్జరీ వివరాలను వెల్లడించారు. ‘‘తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న సద్గురుకు వైద్య పరీక్షలు చేశాం. మెదడులో రక్తస్రావం జరిగిందని నిర్ధారించుకున్నాం. ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు కొన్ని గంటల్లోనే ఆయనకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది’’ అని డాక్టర్ వినిత్ సూరి చెప్పారు. తన రోజువారి కార్యకలాపాల్లో తలనొప్పి సమస్యను సద్గురు పెద్దగా పట్టించుకోలేదని.. అయితే మార్చి 15న నొప్పి తీవ్రమవ్వడంతో తమను సంప్రదించారని పేర్కొన్నారు.

66 యేళ్ల సద్గురు పర్యావరణ పరిరక్షణ కోసం‘‘సేవ్ సాయిల్’’ ‘‘ర్యాలీ ఫర్ రివర్స్’’ కార్యక్రమాలను నిర్వహించారు. 

Tags:    

Similar News