మోదీ 'ముస్లిం లీగ్ ముద్ర' వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు..
ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు కూడా రావనే భయం మోదీని వెంటాడుతుందని, అందుకే జనాన్ని రెచ్చగొచ్చే ప్రసంగాలు చేస్తున్నారని ఏఐసీసీ చీఫ్ ఖర్గే పేర్కొన్నారు.
By : The Federal
Update: 2024-04-09 09:42 GMT
కాంగ్రెస్ మేనిఫెస్టోలో 'ముస్లిం లీగ్ ముద్ర' ఉందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోదీ ప్రసంగాల్లో ‘ఆర్‌ఎస్‌ఎస్ భావాజాలం’ ఉందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావనే భయం మోదీని వెంటాడుతుందని, అందుకే జనాన్ని రెచ్చగొచ్చే ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగినన్ని సీట్లు రాకపోవచ్చన్న ఆందోళనతో హిందువులు, ముస్లింలను విభజించే పాత వ్యూహాన్నే ప్రధాని ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది.
మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర..
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగిన ర్యాలీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజదారణ కోల్పోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. వారి మేనిఫెస్టో దేశ విభజనకు మద్దతు ఇచ్చిన ముస్లిం లీగ్‌ను పోలి ఉనందన్నారు.
“కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో లేదు. దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను మేం పరిష్కరించగలిగాం. నక్సల్స్ బెడద బాగా తగ్గింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబించిన కాంగ్రెస్, తన మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తుంది’’ అని విదర్భ ప్రాంతంలోని చంద్రాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ అన్నారు.
మోదీ శనివారం మాట్లాడుతూ, “ప్రతి పేజీ భారతదేశాన్ని ముక్కలుగా విడదీస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ముస్లిం లీగ్‌లో ఉన్న ఆలోచనలనే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుంది. ఇది పూర్తిగా ముస్లిం లీగ్ యొక్క ముద్రను కలిగి ఉంది మరియు మిగిలి ఉన్నదంతా వామపక్షాల ఆధిపత్యం."
కాగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కొన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ నేత జేపీ నడ్డా ప్రధానిని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ మేనిఫెస్టో విభజనకు సంబంధించిన బ్లూప్రింట్, జిన్నా ముస్లిం లీగ్ ఎజెండాకు కఠోర ప్రతిరూపం. జాతీయ ఐక్యత కంటే బుజ్జగింపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ విభజనను శాశ్వతం చేయాలని చూస్తోంది’’ అని బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు.
1942లో మౌలానా ఆజాద్ అధ్యక్షతన జరిగిన 'క్విట్ ఇండియా' కోసం మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపును మోదీ-షా సైద్ధాంతిక పూర్వీకులు వ్యతిరేకించారని ఖర్గే తన పోస్ట్‌లో ఆరోపించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1940లలో ముస్లిం లీగ్‌తో కలిసి బెంగాల్, సింధ్, వాయువ్య ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో తన ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేశారో అందరికీ తెలుసు, ”అని కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారు.
1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలి. కాంగ్రెస్‌ను ఎలా అణచివేయాలి? అనే దాని గురించి ముఖర్జీ అప్పటి బ్రిటిష్ గవర్నర్‌కు రాయలేదా? అని ఖర్గే ప్రశ్నించారు.
ప్రాబల్యం కోల్పోతుండడం వల్లే.: సుప్రియా
బీజేపీ ప్రాబల్యం కోల్పోతుండటంతో ఆ పార్టీ నేతలు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే విమర్శించారు. అందుకే ప్రధాని మోదీకి ముస్లింలీగ్‌పై ప్రేమ మళ్లీ పుంజుకున్నదని చురకలంటించారు. సోమవారం ఆమె ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన బ్లూప్రింట్ అని ఆమె పేర్కొన్నారు.
‘‘10 ఏళ్లు అధికారంలో ఉండి, దేశం ఎన్నికల అంచుల్లో ఉన్నప్పుడు, ప్రధాని తన రిపోర్ట్‌కార్డు చూపించి ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆయన కంగారుపడుతున్నారు. అతను మరోసారి హిందూ-ముస్లిం స్రిప్ట్‌ను ఆశ్రయించాడు" అని ఆమె అన్నారు.