కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో నలుగురు తెలంగాణ అభ్యర్థులు
పార్టీ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు ఆశించినట్లు తెలంగాణ నుంచి కాకుండా కేరళ నుంచే ఈ సారి కూడా పోటీ చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల లో పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తంగా జాబితాలో 39 పేర్లున్నాయి.
మొదటి లిస్ట్ లో తెలంగాణ లోని నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇదే విధంగా ఈ జాబితాలో రాహుల్ గాంధీ, మాజీ మంత్రి శశిథరూర్, కెసి వేణుగోపాల్, భూ పేష్ బగేల్ వంటి ప్రముఖు ల పేర్లు కూడు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం లోని జహీరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, మహబూబాబాద్ (ఎస్ టి రిజెర్వేడ్ ) స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
జహీరాబాద్ లోక్ సభ స్థానానికి సురేష్ కుమార్ షెట్కార్, నల్గొండ కు రఘువీర్ కుందూరు , మహబూబ్నగర్ కు చల్ల వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ కు బలరాం నాయక్ పోరిక లను కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి చెక్ పడింది. కేరళ లోని వయనాడ్ నుండి రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు. అదేవిధంగా, కేరళ మాజీ ముఖ్య మంత్రి కే కరుణాకరన్ కుమారుడు కే మురళీధరన్ త్రిసూర్ లోక్ సభ స్థానం కు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు.
జానా రెడ్డి కొడుకు కోసం ..
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె జానా రెడ్డి కొడుకు రఘువీర్ కు టికెట్ సాధించడం లో విజయవంతం అయ్యారు. తనకు వచ్చిన రాజ్య సభ అవకాశం ను సైతం పక్కన పెట్టి పార్టీ అధిష్టానం వద్ద ప్రయత్నం చేసి రఘు వీర్ రెడ్డి కు నల్గొండ లోక్ సభ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం లో విజయం సాధించారు. ఆయన మరో కుమారుడు జయ వీర్ రెడ్డి కాంగ్రెస్ అభరుడిగా నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం నుండి శాశన సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇతర ప్రముఖుల గురించి
శశిధరూర్ ఎప్పటిలాాగానే కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీా చేస్తారు. ఇక్కడి నుంచి ఆయన గతంలో మూడు సార్లు గెలుపొొందారు. చత్తీష్ గడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ రాజనందన్ గావ్ నుంచి పోటీ చేస్తారు. ఇక కెసి వేణుగోపాల్ కేరళ అళప్పుళ నుంచి పోటీ చేస్తారు.
కాంగ్రెస్ లిస్టు ఇదే...