డిజిటల్ వ్యసనం మరీ పెరిగిపోయింది..
పిల్లలు ముఖ్యంగా స్కూల్ కు వెళ్లే వారు డిజిటల్ బానిసగా మారిపోతున్నారని ఓ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పరిధిని మించి మొబైల్, లాప్టాప్ వంటి స్కీన్లకు..;
By : The Federal
Update: 2024-03-23 12:40 GMT
డిజిటల్ వ్యసనం చిన్న పిల్లలకు విపరీతంగా పెరిగి పోయిందని ఓ సర్వే తాజాగా వెల్లడించింది. 5-16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో 60 శాతం మంది డిజిటల్ వ్యసనాన్ని సూచించే ప్రవర్తనలను ప్రదర్శిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. వెంటనే తగిన రక్షణ చర్యలను నడుంబిగించాలని సూచించింది.
1,000 మంది తల్లిదండ్రుల నుంచి శాంపిల్లను సేకరించిన స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ బాత్ టెక్ ఈ సర్వేను చేపట్టి, ఫలితాలు వెల్లడించింది. తక్కువ నిద్ర , తగ్గిన శారీరక శ్రమ, సమాజంలో సరిగా కలవకపోవడం, అకడమిక్ పనితీరు తగ్గడంతో పాటు స్క్రీన్ ఎక్స్‌పోజర్‌ను పెంచడం వల్ల వివిధ ప్రమాదాలు ఎలా ఎదురవుతాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఈ సర్వే చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
"60 శాతం మంది పిల్లలు డిజిటల్ వ్యసనం బారిన పడ్డారని, 85 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కంటెంట్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నంలో ఇబ్బంది ఎదుర్కొన్నారని"
సర్వే తెలియజేసింది. 70 నుంచి 80 శాతం వరకూ పిల్లలు అవసరమనుకున్న సమయం కన్నా ఎక్కువ మోతాదులో స్కీన్ల ముందు కూర్చుంటున్నారని తెలియజేసింది. దీని వల్ల అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
ఫోన్లలో గేమింగ్, సోషల్ మీడియాను పిల్లలు తరచుగా ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది. అసంబద్ద కంటెంట్ తో పిల్లలను తమ వైపు తిప్పుకునేలా కొన్ని సంస్థలు చేస్తున్నాయని దాని వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
"ప్రస్తుతం 10 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే పేరెంటల్ కంట్రోల్ ఫీచర్‌లను ఉపయోగిస్తున్నారు, స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసే వ్యూహాలను అమలు చేయడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి" అని సర్వే సంస్థ పేర్కొంది.