ఆప్, కాంగ్రెస్ మధ్య కుదిరిన సీట్ల పంపిణీ

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్నీ సీట్ల షేరింగ్ కు సంబంధించిన పీటముడులను మెల్లగా పరిష్కరించుకుంటూ వెళ్తున్నాయి.

Update: 2024-02-24 10:55 GMT

తాజాగా ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి సంబంధించిన సీట్ల పంపకాలను పూర్తి చేసుకున్నాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు ఎంపీ స్థానాలలో నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీ, మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి అంగీకరించాయి. 2019 లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. తాజాగా ఢిల్లీలో చర్చల్లో ఆప్, కాంగ్రెస్ హర్యానా, పంజాబ్, గుజరాత్, గోవా రాష్ట్రాల సీట్లపై కూడా చర్చలు జరిపినట్లు ఇరు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ ఎంపీ స్థానాల్లో ఆప్ పోటీ చేయనుంది. చాందీనిచౌక్, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ సీట్లలో కాంగ్రెస్ పోటీపడనున్నట్లు కాంగ్రెస్ ప్రతినిధి ముకుల్ వాస్నీక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. " గుజరాత్ సంబంధించి రెండు సీట్లలో భరూచ్, భావ్ నగర్ లో ఆప్ పోటీ చేయనుంది. మిగిలిన 24 సీట్లలో కాంగ్రెస్ కు దక్కాయి. అలాగే హర్యానాలో ఆప్ కు కురుక్షేత్ర లో మాత్రమే పోటీ పడుతుంది. అలాగే చండీఘడ్ లోని ఒక సీటులో కూడా కాంగ్రెస్ పోటీలో ఉంటుంది. గోవాలోని రెండు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తాం" అని వాస్నీక్ వెల్లడించారు.

ఈ పొత్తులపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సందీప్ పాఠక్ మాట్లాడుతూ " పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి" అని ప్రకటించారు. వాస్నీక్ మాట్లాడుతూ.. రెండు పార్టీలు ఎవరి గుర్తుపై వారే పోటీ చేసి ఢిల్లీలోని ఏడు సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మొదట ఇండియా కూటమిలో పార్టీలు సీట్ల పంపకాల విషయంలో గట్టిపట్టుదల ప్రదర్శించడంతో ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరించారు.

మొదట గుజరాత్ లో ఆప్ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను సైతం ప్రకటించింది. కానీ తరువాత సీట్ల పంపకాల్లో వాటిని కాంగ్రెస్, వీటిని ఆప్ కే అప్పగించింది. " ఈ రోజు దేశానికి బలమైన ప్రత్యామ్నాయం అవసరం. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ కూటమి ఏర్పడింది. ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ చేసి గెలుస్తుంది. బీజేపీ లెక్కలు తప్పని నిరూపిస్తుంది" అని సందీప్ పాఠక్ అన్నారు. 

Tags:    

Similar News