గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తున్నాం: ప్రధాని మోదీ

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎల్పీడీ సిలిండర్ ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన మిలియన్ల మంది ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని ప్రధాని అన్నారు.

Update: 2024-03-08 09:58 GMT

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ సిలిండర్ పై రూ. 100 తగ్గిస్తున్నామని భారత ప్రభుత్వ ప్రకటించింది. " ఈ రోజు మహిళా దినోత్సవం, ఈ శుభ దినాన్ని పురస్కరించుకుని ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ. 100 తగ్గించాలని నిర్ణయించింది. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది " అని మోదీ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ లో చేశారు.

" వంట గ్యాస్ ను మరింత సరసమైన ధరకు లభించేటట్లు చేయడం ద్వారా మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్ధతు ఇవ్వడం, ఆరోగ్య కరమైన వాతావరణాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది మహిళా సాధికారితకు, ఈజ్ ఆఫ్ లివింగ్ అందించాలనే మా నిబద్దతకు అనుగుణంగా ఉంది" అని ట్వీట్ ప్రధాని రాసుకొచ్చారు.

Tags:    

Similar News