‘సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లాగే చేనేత కళాకారులు కూడా విదేశాలకు వెళ్ళాలి’
చేనేత కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పెరిగేందుకు త్వరలో ఉద్యోగ అవకాశాలపై త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీకి సమగ్ర నివేదిక
By : The Federal
Update: 2024-02-02 02:35 GMT
చేనేత కళాకారులు మెరుగైన జీవితాన్ని గడపాలి
పర్యావరణ పరిరక్షణలో చేనేత కళాకారులది ఎనలేని పాత్ర
పర్యావరణ పరిరక్షణ పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రపంచ దేశాలు చేనేత పై పెట్టుబడులు పెట్టాలి
త్వరలో ఉద్యోగ అవకాశాలపై త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీకి సమగ్ర నివేదిక
సాఫ్ట్వేర్ ఉద్యోగులవలె చేనేత కళాకారులు కూడా విదేశాలకు వెళ్లి, మెరుగైన జీవితాన్ని గడపాలని జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత అన్నారు.
పర్యావరణ పరిరక్షణ పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రపంచ దేశాలు చేనేత కళా ఉత్పత్తు పై పెట్టుబడులు పెట్టాలని, భారతీయ చేనేత ఉత్పత్తులు కు అంతర్జాతీయ మార్కెట్ లభించేలా కృషి జరగాలని ఆయన సూచించారు.
ఈ నెల 18 న ఇండోనేషియాలోని బాలి లో వరల్డ్ వీవర్స్ డే జరుగుతున్న సందర్భంగా ఆయన కొంతమంది కళాకారులతో మాట్లాడారు. జాతీయ చేనేత దినంలాగా అంతర్జాతీయ స్థాయిలో చేనేత దినోత్సవం జరిపేందుకు ప్రపంచ దేశాలను ఒప్పించేందుకు వెంకన్న నేత కృషి చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ సమావేశం జరిగింది.
పర్యావరణ పరిరక్షణలో చేనేత కళాకారులది ఎనలేని పాత్రని ఆయన సమావేశంలో ఆయన గుర్తుచేశారు.
తమ పిల్లల చదువల పేరుతో హైదరాబాద్ వంటి నగరాల్లో చేనేత మగ్గాలు పెట్టిన చేనేత కళాకారులు భవిష్యత్తులో విదేశాలలో తమ పిల్లలతో వెళ్ళి అక్కడ సైతం చేనేత పరిశ్రమను ప్రారంభించే సమయం దగ్గరలోనే ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చేనేత పరిశ్రమల స్థాపన జరగనుందని వెంకన్న నేత ఆశాభావం వ్యక్తంచేశారు. చేనేత కళాకారుల ఉద్యోగ అవకాశాలపై త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ కి సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు వెంకన్న నేత తెలిపారు. హరిత వస్త్ర విప్లవంలో భారత్ విశ్వగురువు అయ్యే రోజులు దగ్గరలోనే వున్నాయని ఆయన అన్నారు.