అక్షయ తృతీయ రోజు నిరాశపరిచిన బంగారం ధరలు
అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు కొనుగోలుదారులను నిరాశపరిచాయి. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరగడంతో కస్టమర్లు నిరాశ చెందుతున్నారు.
అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు కొనుగోలుదారులను నిరాశపరిచాయి. దేశంలో చాలామంది ఈరోజున బంగారం, లేదా వెండి కొంటే వారి ఇంట సిరి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు. దీంతో అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10 న అనగా ఈరోజు వచ్చింది. అయితే ఈరోజు బంగారం ధరలు భారీగా పెరగడంతో కస్టమర్లు నిరాశ చెందుతున్నారు.
ఉదయం నమోదైన బంగారం ధరల వివరాల ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.850 పెరిగింది. కేజీ వెండి ధర రూ.1300 పెరిగింది. అమాంతం భారీగా పెరిగిన ధరలు కొనుగోలుదారులను బెంబేలెత్తియించాయి.
బంగారం ధరలు ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి...
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73240 ఉండగా... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67150 కి చేరింది. హైదరాబాద్, విజయవాడ విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73090 కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67000 కి చేరుకుంది.
వెండి ధరలు ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి...
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.86500 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.90000 నమోదయ్యి ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంది.