మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఎలా స్పందించారు?

ప్రధాని మోదీ వైఖరిలో మార్పు కనిపిస్తుందని, తన స్నేహితులపై కూడా దాడి చేయడం మొదలుపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

Update: 2024-05-08 13:07 GMT

మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల జరిగిన తర్వాత ప్రధాని మోదీ కుర్చీ వైఖరిలో మార్పు కనిపిస్తుందని, తన స్నేహితులపై కూడా దాడి చేయడం మొదలుపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా అంబానీ-అదానీ అంశాన్ని కాంగ్రెస్ ఎందుకు లేవనెత్తడం లేదో ప్రజలకు వివరించాలని ప్రధాని చెప్పడంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీలతో రాహుల్ ‘డీల్’ కుదుర్చుకున్నారా? అని మోదీ ప్రశ్నించారు.

‘కాలం మారుతోంది.. మిత్రులు మిత్రులు కాదు...! మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాక ఈరోజు ప్రధాని తన స్నేహితులపైనే దాడులు చేయడం మొదలుపెట్టారు.. మోదీజీ కుర్చీ వణుకుతున్నట్లు స్పష్టమవుతోంది.. ఇదే అసలు ధోరణి." అని ఖర్గే హిందీలో ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

తెలంగాణలోని వేములవాడలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. 'ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి ఈ వ్యక్తులు (కాంగ్రెస్) అంబానీ-అదానీల గురించి మాట్లాడడం మానేశారు. నేను తెలంగాణ నేల నుంచి అడగాలనుకుంటున్నాను. అంబానీ-అదానీ నుంచి కాంగ్రెస్‌కు కరెన్సీ నోట్ల కట్టలు అందాయి? అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ విమర్శనాస్రాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. "తన పార్టీకి రూ. 8,200 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను సేకరించిన వ్యక్తి ఈ రోజు ఇతరులపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని తన సన్నిహితులకు విరాళాలకు ప్రతిఫలంగా రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు, లైసెన్సులు ఇచ్చారని గుర్తుంచుకోవాలని రమేష్ పేర్కొన్నారు.

మోదానీ స్కామ్‌పై జేపీసీ విచారణ..

‘‘2023 జనవరి 28 నుంచి కాంగ్రెస్ పార్టీ ‘మోదానీ కుంభకోణం’పై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని పదే పదే డిమాండ్ చేస్తోంది. ఎన్నికలు ప్రారంభమైన తర్వాత కూడా మేము ఈ డిమాండ్‌ను పునరుద్ఘాటించాం’’ అని జైరాం రమేష్ చెప్పారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..సంపద మొత్తాన్ని మోదీ బడా వ్యాపారులకు అప్పగించారనే వాస్తవాన్ని ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.

మోదీలో కలవరపాటు మొదలైంది..

మూడు దశల ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ వాస్తవాన్ని గ్రహించారని మరో పార్టీ నేత పవన్ ఖేరా అన్నారు. ప్రధాని తన స్నేహితుల నుంచి రూ. 8,200 కోట్లు వసూలు చేశారని, ఎన్నికల్లో ఓడిపోతున్నానని తెలిసి వారిపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలపై ప్రధాని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, వారిపై సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడులు ఎప్పుడు జరుగుతాయని కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనాట్‌ ప్రశ్నించారు.

Tags:    

Similar News