కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతుంది?

కర్ణాటకలో ఐదేళ్ల కిత్రం బీజేపీ అధికారంలో ఉన్నపుడు 25 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎలా కట్టడి చేస్తుంది?

Update: 2024-04-28 06:27 GMT

కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రపోరు నెలకొంది. దీంతో ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కింది.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని కాంగ్రెస్ ఓడించిన విషయం తెలిసిందే. 1999 నుండి ఎన్నడూ లేని విధంగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి గట్టి పోటీనిస్తుంది హస్తం పార్టీ. అప్పటి సీఎం SM కృష్ణ నేతృత్వంలోని కాంగ్రెస్ 28 లోక్‌సభ స్థానాలకు గాను 18 స్థానాలను కైవసం చేసుకోగా.. బీజేపీ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది. అప్పటి నుంచి కర్నాటకలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం తప్పలేదు. 2004లో ఎనిమిది, 2009లో ఆరు, 2014లో తొమ్మిది, 2019లో ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది.

ఐదేళ్ల క్రితం కర్ణాటకలో బీజేపీ 25 సీట్లను కైవసం చేసుకుంది. దాంతో నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో 300 సీట్ల మార్కును అధిగమించి, రెండో సారి పాలనా పగ్గాలు చేపట్టేందుకు దోహదపడింది. బీజేపీకి పంక్చర్ వేయలేకపోయినా.. ఈసారి కచ్చితంగా ఓడిస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని రాజకీయ పరిశోధకుడు, విశ్లేషకుడు ప్రొఫెసర్ ఎ నారాయణ ది ఫెడరల్‌తో అన్నారు.

విభేదాలను పక్కన పెట్టి..

"వారి మధ్య విభేదాలు ఉన్నా (ముఖ్యమంత్రి) సిద్ధరామయ్య, (ఆయన డిప్యూటీ) డికె శివకుమార్ అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పోరాడారు. ఇప్పుడు అదే చేస్తున్నారు" అని పేర్కొన్నారు. ఉమ్మడి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని రెండు విధాలుగా ఎదుర్కోబోతుందని చెప్పారు.

ఆర్థిక పక్షపాతం..

నిధుల కేటాయింపు, పన్నుల పంపిణీలో కేంద్రం కర్ణాటక పట్ల పక్షపాతధోరణి అవలంభిస్తోందని, ఫలితంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ కేంద్రం వైఖరిని ప్రజల ముందుంచారు సీఎం సిద్ధరామయ్య. కర్నాటక దేవాదాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ కేంద్రం పక్షపాతాన్ని నిశితంగా బయటపెట్టారు కూడా.

సంక్షేమ పథకాలు..

ఎన్నికల హామీలను పక్కగా అమలు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని భావనను జనాల్లోకి తీసుకెళ్లున్నారు.

వివాదాస్పద ప్రకటనలకు దూరం..

కర్ణాటక కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్‌ ఇద్దరూ గతంలో ఒకరిపై ఒకరు పర్పసరం విమర్శలు , ఆరోపణలు చేసుకునేవారు. ఐక్యంగా ఉంటూ వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉంటే తప్ప బీజేపీని ఓడించలేమని తెలుసుకుని ఆ దిశగా ముందుకు సాగుతున్నారు.

సామాజిక వర్గ కోణంలోనూ..

సిద్ధరామయ్య అహిండ సామాజిక వర్గానికి మాస్ లీడర్‌ పాత్ర పోషిస్తుండగా, శివకుమార్ వొక్కలిగ వర్గాన్ని ప్రాతినిథ్యం వహిస్తూ సామాజిక వర్గాల ఓటర్ల దీవెనల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాలకు నిలయమైన పాత మైసూరు ప్రాంతంలో ఈ కాంగ్రెస్ వ్యూహం బాగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కుటుంబ సంబంధాలు..

కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది లోక్‌సభ అభ్యర్థులు.. పార్టీ అగ్రనేతల బంధువులు. ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు, శివకుమార్ సోదరుడు, మంత్రి మధు బంగారప్ప సోదరి, మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, మంత్రి ఈశ్వర్ ఖండ్రే కుమారుడు, మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున భార్య, కుమార్తె. మంత్రి శివానంద్ పాటిల్, మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ కుమారుడు, మంత్రి సతీష్ జార్కిహోళి కుమార్తె.వీరిని పోటీలో దించం కాంగ్రెస్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమనే చెబుతున్నారు.

గెలుపే లక్ష్యంగా బరిలోని మంత్రులు..

తమ కుటుంబసభ్యులే ఎన్నికల బరిలో నిలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల తరపున వారు ముందుండి ప్రచారం చేస్తున్నారు. తమ వారిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ‘‘మంత్రుల్లో ఎక్కువ మంది జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నారు. అభ్యర్థి గెలుపునకు కృషి చేయడమే వారి పని. గతంలో మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు లోక్‌సభ అభ్యర్థులకు మద్దతివ్వడంలో చురుగ్గా పాల్గొనలేదని’’ అని ఒక మంత్రి చెప్పారు.

కాంగ్రెస్ అసాధారణ దూకుడు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. 

Tags:    

Similar News