29 ఆగస్టు 1947న అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన 14 రోజులకు రాజ్యాంగ నిర్ణాయక సభ లో భాగంగా ఒక రచనా ఉప సంఘాన్ని రూపొందించింది. ఫిబ్రవరి 1948 నాటికి రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతిని భారతీయ సివిల్ సర్వెంట్, ప్రముఖ న్యాయమూర్తి, ఆ తరువాత అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తిగా వ్యక్తి, ఆయాదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనదేశంలో అప్పుడున్న భారత ప్రభుత్వ చట్టం 1935ను విస్తరిస్తూ మన దేశానికి ఏ విధమైన పాలనా విధానం సరిపోతుందో అని అనుకున్నారు. కాని సరిపోదు.
తొలి చిత్తు ప్రతిని రూపొందించిన బిఎన్ రావు ముఖ్యసలహాదారుగా అయినప్పటికీ కాని చాలాకాలం ఆయన విదేశాల్లో ఉండిపోవలిసి వచ్చింది. ఆ రచన సంఘంలో ఎంత మంది ఉన్నా మొత్తం మీద అయిదుగురు కీలకమైన సభ్యులలో ఒకరిద్దరి పాత్ర లేనే లేదు. మరికొందరి పాత్ర స్వల్పం అని ఈ రచనా సంఘంలో సభ్యుడైన టి టి కృష్ణమాచారి చెప్పారు.
భారం అంతా ఆయనదే
అధ్యక్ష హోదాలో ఉన్న అంబేడ్కర్ ఆపాత్రను హుందాగా నిర్వహించి, రచనలో కీలకమైన బాధ్యతను స్వీకరించి, రాజ్యాంగ పితగా ఖ్యాతి పొందారు. అయితే మొత్తం రచనా బాధ్యత ఈ సంఘానికే పరిమితం కాలేదు.
కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ, రాష్ట్రాల అధికారాల కమిటీ నేతగా వల్లభ్ బాయ్ పటేల్, ప్రాథమిక హక్కుల కమిటీకి జె బి కృపలానీ, ఇంకా అనేకానేక అంశాలపైన ఉపసంఘాలు పనిని పంచుకుని ఆయా నియమాలకు ఒక రూపం ఇచ్చారు.
పదవికోసం కాదు అట్టడుగు ప్రజలకోసం
ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు మాత్రమే రాజ్యాంగ సభలో ఉంటారు. అంబేద్కర్ ను బొంబాయి గెలిపించలేదు. బెంగాల్ నుంచి ముస్లింలీగ్ మద్దతుతో సభ్యులైనారు. దళితులకు మైనారిటీలకు సమాన హక్కులు సాధించడానికే వస్తున్నానన్నారు.
కానీ దేశవిభజనతో ఆయన స్థానం పాకిస్తాన్ వెళ్లిపోయింది. బొంబాయి రాష్ట్ర ప్రధాన మంత్రి (స్వతంత్రానికి ముందు ఆయారాజ్యాలకు ప్రధానమంత్రులు ఉండేవారు) బిఎన్ ఖేర్ కు రాసిన ఒక ఉత్తరంలో అంబేడ్కర్ ను బొంబాయి నుంచి గెలిపించాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు.
ఎం ఆర్ జయకర్ తో రాజీనామా చేయించి, అంబేడ్కర్ ను గెలిపించుకుని రాజ్యాంగసభకు పంపారాయన. అంబేడ్కర్ మహోన్నత విద్యావంతుడు, అటు ఆర్థిక శాస్త్రం, ఇటు న్యాయశాస్త్రం ఆపోసన పట్టిన వాడు. పాలనా వ్యవస్థల నిర్మాణం గురించే అధ్యయనం చేసిన వ్యక్తి. కనుక రచనా ఉప సంఘంలో ఉండాలని రాజేంద్రప్రసాద్ సూచించారు.
ఒక్క అక్షరాన్ని సాక్ష్యాధారాలతో నిలబట్టిన వారు
అంబేడ్కర్ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసారు. ఆయన భారత రాజ్యాంగానికి తండ్రి. తొలి చిత్తు ప్రతిరూపొందించిన బిఎన్ రావ్ కూడా రచయిత కాడు.
ఆయన తొలి నిర్మాత. రాజ్యాంగానికి తుదిరూపు ఇచ్చిన ముఖ్య నిర్మాత అంబేడ్కర్. కనుక అంబేడ్కర్ ను భారత రాజ్యాంగ ముఖ్య నిర్మాత అనడంలో సందేహం లేదు. కావ్యాన్ని నాటకాన్ని నవలను రాసిన వాడిని రచయిత అంటారు.
ఒక దేశానికి కొన్ని దశాబ్దాలపాటు విధానాలను రూపొందించే విధానాన్ని కలిగి ఉండే పత్రాన్ని రాజ్యాంగం లేదా సంవిధానం అంటారు. ఆ సంవిధానానికి అమలు కాదగిన ఒక మార్గదర్శినిగా రూపొందించాన్ని రచన అంటే సరిపోదు.
రచన అంటే సృష్టి. కాని రాజ్యాంగం అనేది సృష్టించే వస్తువు కాదు. వ్యవస్థ నిర్మాణానికి ప్రక్రియ అది. దాన్ని ప్రపంచంలో ఎక్కడ మంచి ఉందో అక్కడనుంచి వెతికి పట్టి, మనదేశానికి సరిపోయేట్టుగా నిర్మించడం అనేది రచన కన్న చాలా క్లిష్టమైన పని అని అర్థం చేసుకోవలసి ఉంది.
ఒక్కొక్కపదాన్ని ఎంచుకుని, ఒక్కొక్కవాక్యాన్ని నిర్మించి, అందులో భాషను వాడిన పదాలను ఆ విధంగా ఎందుకు వాడవలసి వచ్చిందో వివరించి. అనుమానాలు, సవరణలు ప్రశ్నల రూపంలో వచ్చిపడిన ప్రసంగాలకు సమాధానం చెప్పి, చివరకు ఒక గొప్ప వ్యవస్థ ను నిర్మించే గలిగే సంవిధానాన్ని మన ముందుంచారు.
ఒక ఆర్కిటెక్ట్, ఒక బిల్డర్, రాబోయే వ్యవస్థకు పునాది వంటి లేదా ఒక భవనానికి కావలసిన మౌలిక మైన ఉక్కు ఫ్రేమ్ లేదా శరీరానికి ఆస్తి పంజరంతో కూడేన నాడీ వ్యవస్థ వంటి ఫ్రేమ్ ను రూపొందించినది అంబేడ్కర్.
మొత్తం రచనా ఉపసంఘం సమావేశాలన్నింటికీ వచ్చిన ఏకైక వ్యక్తి అంబేడ్కర్ మాత్రమే. కనుక రాజ్యాంగం నిర్మించిన రచనా ఉపసంఘం అధ్యక్షుడు అంబేడ్కర్ కే పీఠిక నిర్మాణం ఘనత కూడా చెందుతుంది.
అంబేడ్కర్ కాక మరెవరు?
కానీ రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కన్న ఎక్కువ శ్రద్ధచూపిన వారుగానీ కష్టపడ్డావారు గానీ మరొకరు లేరు’’ అని జవహర్ లాల్ నెహ్రూ చాలా స్పష్టంగా ప్రకటించారు.
అయితే అంబేడ్కర్ తన చివరి ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాణ ఘనత తానొక్కడికే ఇవ్వడం సరికాదని ప్రకటించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో, రాజ్యాంగ సభలో కూడా అనేక మంది రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని ఆయన వివరంగా చెప్పారు.
సామాన్యుడు, అసమాన, సమానతా భారత నిర్మాత
‘‘రాజ్యాంగ నిర్మాణంచేసిన ఘనత నాకు ఇచ్చారు, కాని నిజంగా అది నాకు చెందదు. అందులో కొంత సర్ బి ఎన్ రావ్ కు చెందుతుంది.. రాజ్యంగ సభకు ఆయన రాజ్యాంగ సలహాదారుడు.
ఆయనే తొలి చిత్తు ప్రతి రూపొందించి మా డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలనకు సిద్ధం చేశారు’’ అంబేడ్కర్ 25 నవంబర్ 1949న రాజ్యాంగ సభలో చెప్పారు. అదే ఆయన సామాన్యత. అసామాన్య నిరాడంబరుడు. గర్వంలేని వ్యక్తి అంబేడ్కర్.
‘‘రాజ్యాంగ నిర్మాత అనే ఘనత నాకు ఇచ్చారు, కాని నిజంగా అది నాకు చెందదు’’ – అని అంబేడ్కర్ అంటే నమ్మడం సాధ్యమా. కాని అది ఆయన అంత నిరాడంబరుడు. నిరంతర పనిచేస్తూ నిమిషం కూడా వృథా చేయకుండా దేశం కోసం సమాజం కోసం పేదవారి కోసం ఆలోచించిన వ్యక్తి.
‘‘నాకు ఇష్టం కాకపోయినా...’’ – అంబేడ్కర్
నేను కిరాయికి పనిచేసేవంటి వాడిని. ఇది చేయాలంటే అది చేసేపని. నాకు ఇష్టం కాకపోయినా ఎన్నో చేయాల్సి వచ్చింది. నేను మంచి పుస్తకమనుకుంటాను, అది ‘‘రాష్ట్రాలు మైనారిటీలు’’ అనేది.
మన స్వతంత్ర భారత రాజ్యాంగ దేశంలో వారి హక్కులు ఏవి, వాటిని ఏ విధంగా సాధించగలం’’ అన్నది నా ప్రశ్న. ఈ పుస్తకం 1947లో ప్రచురించడమైంది. అదీ రాజ్యాంగ నిర్ణాయక సభ ఏర్పాటయిన మూడు నెలల తరువాత. మన రాజ్యాంగం ‘Constitution of the United States of India’ అని నేను నేను అనేవాడిని.
తను రాజ్యాంగ నిర్ణాయక సభ ఏర్పాటు కాకముందు, 1940 దశాబ్దంలో నేను షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ స్థాపించి, దాని పక్షాన, దాని సభ్యుడిగా ఉన్నపుడు, ఈ రాజ్యాంగ నిర్ణాయక సభ కింద ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి సమర్పించిన ఇచ్చిన వినతి ఇది.
ఏదేమైనా సభ ప్రతి అంశాన్నిసమగ్రంగా చర్చించి తుది అంగీకారం దొరికేది. ఏడుగురు సభ్యులు తమలో ఒకరో మరో సభ్యుడో ఇదే జరగాలని, వారికి పోటీగా 308 మంది సభ్యుల ముందునిలబడే సాధ్యం కాదని తెలిసేది.
పట్టుబట్టే వారు కాదు అని సాదుల్లా స్వయంగా చెప్పిన మాటలు రాజ్యాంగం చర్చలో ప్రతి అక్షరం రికార్డ్ అయి ఉండింది కదా. (Source: The Constitution and The Constituent Assembly ─ Some Select Speeches; Lok Sabha Secretariat, 1990)
ఎవరేమయినా మనం గొప్పగా అర్థం చేసుకోవలసింది అంబేడ్కర్ గారి మాటే. రాజ్యసభలో 2 సెప్టెంబర్ 1953లో చాలా స్పష్టం గా అంబేడ్కర్ చెప్పారు. ‘‘సభ్యులు ప్రతిసారీ మాతో అంటూ ఉండేవారు.
ఓహ్ మీరు రాజ్యాంగాన్నినిర్మించారు’’ అంబేడ్కర్ గారి సమాధానం ఇది: ‘‘నేనేం జేయను..నేను కూలికి పనిచేసేవాడిని a hack. ఎన్నో సందర్భాల్లో నాకు ఇష్టంలేకపోయినా చేయాల్సింది తెలుసా’’
నేనే తగలబెడతా అని అంబేడ్కర్ అన్నారా?
ఇంకోసారి కూడా ‘‘మిత్రమా ఇంకేం చెప్పను... నేనే ముందు ఈ రాజ్యాంగాన్ని తగలబడేవాణ్ణి. ఇది నాకొద్దు. ఎవరికి పనికిరాదు’’ (Dr. Babasaheb Ambedkar: Writings and Speeches, Vol. 15, pp, 860, 862)
రద్దు చేస్తేనంటే ఫరవాలేదని అన్నారా?
22 డిసెంబర్ 1952న పూనా జిల్లా లా లైబ్రరీ సభ్యులముందు నేను ప్రసంగిస్తూ, అంబేడ్కర్ ‘‘ఏదైనా నాకయితే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు ఒప్పుకునే వారిలో నేనొకడిని సిద్ధంగా ఉంటాను. ఈ రాజ్యాంగాన్ని మళ్లీ రాసుకోవలసింది. (Dr. Babasaheb Ambedkar: Writings and Speeches, Vol. 17, p. 480)
అంబేడ్కర్ రాజ్యాంగ విజయాలు
రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో చేసిన గొప్ప కృషి ఎవరు మరువలేరు. రాజ్యాంగ నిర్మాతలుగా అంబేద్కర్ చేసిన గొప్ప పనులు ఇవి.
1. ఒకటి రచనా సంఘంలో అధ్యక్షుడు కావడం,
2. పీఠిక రచనలో కీలకమైన పాత్ర నిర్వహించడం,
3. ప్రాథమిక హక్కులను సేకరించడం వాటిని అమలు చేయడానికి, చేసిన గొప్ప పనులు ఊహించలేము.
4. సమానత, భావ స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం సాధించడం,
5. వివక్ష నుంచి భారత దేశ పౌరులం రక్షించడం,
6. అనేకానేక స్వేచ్ఛ లను అమలు చేసుకోవడం ముఖ్యమైనవి.
అంతటి విజయాలు చేసినా, రాజ్యాంగ నిర్మాణం తరువాత కూడా ఆ రూల్ ఆఫ్ లా తన ముందే కలలు నిలబడకుండా కనపడుతూ ఉంటే బాధ పడ్డారు, ఒక నిస్పృహ, నిరాశ, శరవేగంగా అభివృద్ధి సాధ్యం కావడం లేదని మనసులో తిన్నారు. ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది.
కేవలం 65 సంవత్సరాలలో, బాల్యం చదువు తరువాత మొత్తం జీవితం అంతా దేశానికే అంకితం చేసారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం సామాజిక న్యాయం, విద్య, సమానత్వం కోసమే పోరాటం. భారత రాజ్యాంగ రూపకర్తగా, దళితుల హక్కుల కోసం ఆరాటం. రాజకీయంగా సాధికారత లేకపోతే ప్రగతి లేదన్నారు.
అంబేద్కర్ భారతీయ సమాజంపై గణనీయమైన ప్రభావం చూపాడు, సామాజిక న్యాయం, సమానత్వం చట్టబద్ధమైన పాలన గురించి చర్చలకు దారితీశాడు. అంటరానితనం నిర్మూలించడానికి ప్రయత్నం చేసారు.
అదొక ఉద్యమం, ఇంకా ముగించని ఉద్యోగం. సమానత్వం ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో 14వ అధికరణం అని పేర్కొన్నారు. అది అంతులేని కథ. విద్యావంతులుగా ఉండండి, వ్యవస్థీకృతంగా ఉండండి ఆందోళన చెందండి అని ప్రబోధించారు. అంబేద్కర్ జీవితం ఒక మార్గదర్శి, ఒక స్ఫూర్తి.