మన ‘సంతోషం’ పాతాళంలో, ఫ్లిన్లండ్ ఆకాశంలో...

మన సంతోషం ఎక్కడో కిందపడిపోయింది. పై నుంచి చూస్తే ఎంత వెతికినా కనిపించనంత కింద ఉంది. సంతోషంగా దేశాలేవి అని సర్వేలో తేలిన పచ్చినిజం...

Update: 2024-03-20 10:40 GMT

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్నదేశం. అందులో యువతరం పాల్లు 40 శాతం కంటే ఎక్కువ. బిలియన్ డాలర్ల బిజినెస్ లు, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ ఇవన్నీ మనల్నీ సంతోషంగా ఉంచలేకపోతున్నాయి. రేపో మాపో మనం విశ్వ గురు. ఎక్కడో ఏదో మిస్సయింది. భారతదేశంలో ఏ మాత్రం  సంతోషం లేదు.  చిన్న చిన్న దేశాలు కూడా మనకంటే సంతోషంగా ఉన్నాయి.  భారత్ ఖుషీగా లేదని ప్రపంచ హర్ష నివేదిక (World Happiness Index) వెల్లడించింది.


ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? వరల్డ్ హ్యపీయెస్ట్ రిపోర్టుల్లో మన ర్యాంకు ఎంత అనుకుంటున్నారు. 126, మొత్తం 143 దేశాలను సర్వే చేసి రిపోర్టు ఇస్తే మనం ఎక్కడో ఉన్నాం. భారతీయులు అస్సలు సంతోషంగా లేరంట.. ఎందుకో మరీ.. పాకిస్తాన్, నేపాల్, చైనా కూడా మనకంటే సంతోషంగా ఉందంట. పాలస్తీనా కూడా మనకంటే మెరుగ్గా ఉంది. దాని ర్యాంకు 103..



మార్చి 20న ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ డే సందర్భంగా హ్యపీనెస్ రిపోర్టు విడుదల అయింది. ఇందులో నార్డిక్ దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఫిన్లాండ్ అగ్రస్థానం సాధించగా, రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్ ల్యాండ్, నార్వే ఏడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో తాలిబన్ పాలనలో ఉన్న ఆప్ఘనిస్తాన్ ఉంది.

తరువాత వరుసగా లెబనాన్, లెసోతో, సియెర్రా లియోన్, కాంగో నిలిచాయి. ఆశ్చర్యంగా ఐదు నెలలుగా యుద్ధంలో పోరాడుతున్న ఇజ్రాయెల్ కూడా ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. అలాగే యూఎస్ఏ, జర్మనీ టాప్ 20 నుంచి బయటకు వెళ్లాయి. అమెరికా ఈ జాబితాలో 23, జర్మనీ 24 వ స్థానంలో నిలిచాయి.

ఈ జాబితాలో చాలా దేశాలు గతం సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కాస్త మెరుగు కావడమో.. లేదా దిగజారడమో జరిగింది. కానీ భారత్ మాత్రం గత ఏడాది, ఇప్పడు ఒకే ర్యాంకులో కొనసాగుతున్నాయి. సంతోషంగా ఉన్నారా లేరా అనే విషయాన్ని పరిశీలించడానికి ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. తలసరి జీడీపీ, సామాజిక మద్ధతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి వాటి ఆధారంగా నివేదికను రూపొందించారు.

నివేదికలోని చాలా అంశాలను పరిశీలిస్తే వృద్ధుల కంటే యంగ్ జనరేషన్ సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలల్లో 2006-10 మధ్య 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్నారు సంతోషంగా లేరని తేలింది. ఇప్పటి నివేదిక ప్రకారం వృద్దులు, యువకులు కూడా ఈ దేశాల్లో సంతోషంగా ఉన్నారట..
Tags:    

Similar News