ఇద్దరికి జ్ఞానపీఠ్ అవార్డులు..

జ్ఞానపీఠ్ అవార్డుకు ఇద్దరు ఎంపికయ్యారు. ఒకరు ప్రఖ్యాత ఉర్దూ కవి గుల్జార్‌. మరొకరు సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్య.;

Update: 2024-02-17 14:07 GMT

జ్ఞానపీఠ్ అవార్డుకు ఇద్దరు ఎంపికయ్యారు. ఒకరు ప్రఖ్యాత ఉర్దూ కవి గుల్జార్‌. మరొకరు సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్య. వీరి పేర్లను జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్ ఎన్నో హిందీ సినిమాలకు పాటలు రాశారు. ఈ యుగంలోని అత్యుత్తమ ఉర్దూ కవులలో ఈయన ఒకరు. ఇంతకుముందు 2002లో ఉర్దూకు సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్ అందుకున్నారు. ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా అందుకున్నారు.

రామభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసి పీఠం వ్యవస్థాపకుడు. ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మికవేత్త. విద్యావేత్త కూడా. 100 కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు.

రెండు భాషలకు చెందిన ప్రముఖ రచయితలకు అవార్డు ఇవ్వాలని జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా "సంస్కృత సాహిత్యవేత్త జగద్గురు రాంభద్రాచార్య, సుప్రసిద్ధ ఉర్దూ సాహితీవేత్త గుల్జార్ ను ఎంపికచేశారు. గోవా రచయిత దామోదర్ మౌజో 2022కి ఈ అవార్డును అందుకున్నారు.

సాహిత్యాభిలాషి గుల్జార్..

అవిభక్త భారతదేశంలోని జీలం జిల్లాలోని దేనా గ్రామంలో 1934 ఆగస్టు 18న జన్మించిన గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కల్రా. తండ్రి చిరు వ్యాపారి. పేరు మఖన్ సింగ్. తల్లి మరణానంతరం ఎక్కువ సమయం తండ్రితోనే గడిపిన గుల్జార్ చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఇంటర్‌లో ఫెయిల్ అయ్యారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు.

బహుభాషా కోవిధుడు రామభద్రాచార్య..

సంస్కృత భాషా పండితుడు, జగద్గురు రామభద్రాచార్యులు బహుభాషా కోవిధుడు. 100 కంటే ఎక్కువ పుస్తకాలు రచించారు. అయోధ్యలోనే రాముడు జన్మించాడనడానికి ఆధారాలు చూపారు. రామభద్రాచార్య కూడా 2015లో పద్మవిభూషణ్‌తో సత్కరించారు. ‘‘భార్గవరాఘవీయం, అష్టావక్ర, ఆజాద్‌చంద్రశేఖరచరితం, లఘురఘువరం, సరయులహరి, భృంగదూతం, కుబ్జపత్రం’’ ఈయన రాసినవే.

Tags:    

Similar News