కంచ ఐలయ్యకు ‘మా జాతి సూర్యుడు’ అవార్డు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతులమీదుగా కంచ ఐలయ్య అందుకోనున్న అవార్డు ఏమిటి? ప్రదానోత్సవంలో ఎవరెవరు పాల్గొంటున్నారు?

Update: 2024-01-10 03:52 GMT

సామాజికవేత్త, బడుగుల తత్వవేత్త ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌ ‘మా జాతి సూర్యుడు’ (మన కమ్యూనిటీ సూర్యుడు) అవార్డుకు ఎంపికయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ అవార్డును జనవరి 13న ఆయనకు ప్రదానం చేయనున్నారు. సాహిత్యం, సామాజిక చైతన్యానికి చేసిన కృషికిగాను అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, రూ. రూ. 50వేల నగదు అందజేస్తారు. కర్నాటక కలబురిగి ప్రాంతంలోని కనక గురు పీఠంఆంథని బ్రిడ్జి డివిజన్‌ సంస్థ ఈ అవార్డును ఇవ్వనుంది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కనక గురుపీఠాధిపతి నిరంజనానంద మహాస్వామి, కర్నాటక మంత్రులు సతీష్‌ జెర్కిహోలి, బైరతి సురేష్‌, ప్రియాంక్‌ ఖర్గే పాల్గొననున్నారు.

కంచ ఐలయ్య గొర్రెలకాపరి వృత్తి, గొప్పతనం, చారిత్రక నేపథ్యం గురించి గొప్పగా చెప్పారు. పదిహేడవ శతాబ్దంలో జీవించిన (కనకదాసు 1509 నుండి 1609 వరకు 100 సంవత్సరాలు జీవించాడని చెబుతారు) కనకదాసు గొర్రెల కాపరి సాధువు, ఆయన ఆత్మగౌరవాన్ని ఐలయ్య నొక్కి చెప్పారు.

కంచ ఐలయ్య ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్నారు. ‘గౌతమ బుద్ధుని పొలిటికల్‌ థాట్‌’పై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందారు. తరువాత దాన్ని ‘గాడ్‌ యాజ్‌ పొలిటికల్‌ ఫిలాసఫర్‌: బుద్ధుని ఛాలెంజ్‌ టు బ్రాహ్మణిజం’ అనే పుస్తక రూపంలో ప్రచురించారు.

1994-97 మధ్య మహాత్మా నెహ్రూ ఫెలో, జ్యోతిరావు ఫూలే అవార్డు అందుకున్నారు ఐలయ్య. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 38 సంవత్సరాల బోధన, అధ్యయనం, పరిశోధన అనంతరం 2012లో రిటైరయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్‌లో ఏడేళ్లపాటు పనిచేశాడు.

Tags:    

Similar News