కోర్టులో కన్నీరు మున్నీరైన ఆప్ ఎంపీ స్వాతీమాలివాల్

ఆప్ రాజ్యసభ సభ్యురాలు మలివాల్ కోర్టులో కంటనీరు పెట్టుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు బెయిల్ ఇస్తే తన ప్రాణాలకు ముప్పు ఉందన్నారు.

Update: 2024-05-27 12:24 GMT

ఆప్ రాజ్యసభ సభ్యురాలు మలివాల్ కోర్టులో కంటనీరు పెట్టుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు బెయిల్ ఇస్తే తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ కన్నీరు మున్నీరయ్యారు. బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ మే 28 న ముగియనుంది. ఆయన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు విచారిస్తోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశారంటూ మలివాల్ కేసు పెట్టింది. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ దాడి చేసిన వారే తిరిగి ఆమెపై ఆరోపణలు చేస్తున్నారని, దాడి జరిగిన ప్రాంతాన్ని తానే ఎంచుకున్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ ఆమె మే 13న ఢిల్లీ సీఎం ఇంట్లో దాడి సంఘటనను గుర్తుచేసుకుంటూ కోర్టు లోపల ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కన్నీరుమున్నీరయ్యారు.
కోర్టులో ఆమె తన వాదనలు వినిపిస్తూ ఆప్ "ట్రోల్స్ ఆర్మీ" తనను నిందించారన్నారు. అత్యాచారం, హత్యాయత్నం బెదిరింపులు వస్తున్నాయని వివరించారు. ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాథీని నిందించారు. ఆయన ఏకపక్షంగా తనపై ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపించారు. బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తే, "నాకు, నాకుటుంబానికి ప్రాణహానీ ఉందని కోర్టుకు తెలిపింది."
కేజ్రీవాల్ సహాయకుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు విచారిస్తోంది. మే 24న నాలుగు రోజుల పాటు పొడిగించిన జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. మే 18న ఆయనను అరెస్టు చేశారు.
మలివాల్ కోర్టుకు ఏమని చెప్పారంటే...
తనపై దాడి జరిగిందని నేను ఆరోపించిన నాటి నుంచి నన్ను బీజేపీ ఏజెంట్ నని పదేపదే ఆరోపిస్తున్నారు అని మలివాల్ కోర్టుకు తెలిపారు. "వారికి (ఆప్) ట్రోల్స్ ఆర్మీ ఉంది. పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ నాపే మోహరించారు. నాకు వ్యతిరేకంగా నిరంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లు జరుగుతున్నాయి. ఈ వ్యక్తి (బిభవ్ కుమార్) మామూలువాడు కాదు" అని ఆమె చెప్పారు.
యూట్యూబర్ ధ్రువ్ రాథీ పేరును ప్రస్తావించకుండా, మలివాల్ కోర్టుకు ఆయన గురించి కూడా ఫిర్యాదు చేశారు. "ఇంతకుముందు వాలంటీర్‌గా ఉన్న ఒక యూట్యూబర్ ఏకపక్షంగా వీడియో చేశారు. ఈ వీడియో తర్వాత నాకు హత్య, అత్యాచారం బెదిరింపులు వస్తూనే ఉన్నాయి" అని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.ఇంతకుముందు "నా పార్టీ నాయకులు, వాలంటీర్లు నాకు వ్యతిరేకంగా రూపొందించిన వీడియోలు మాత్రమే వచ్చేవి. అత్యాచారం, హత్య, బెదిరింపులు వంటివి కూడా వస్తున్నాయి. ఈ యూట్యూబర్ ధృవ్ రాథీ నాకు వ్యతిరేకంగా ఏకపక్ష వీడియోను పోస్ట్ చేయడంతో ఈ బెదిరింపులు మరింత తీవ్రం అయ్యాయి అని" చెప్పారు.
మలివాల్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, బిభవ్ కుమార్ దర్యాప్తునకు సహకరించడం లేదని, పోలీసులు అడిగే ప్రశ్నలకు జవాబులు దాటవేస్తున్నారన్నారు. బిభవ్ కుమార్ తరపు న్యాయవాది చెప్పినట్లుగా స్వాతి మలివాల్ అక్రమంగా ఢిల్లీ సీఎం ఇంట్లోకి ప్రవేశించి ఉంటే ఈ విషయంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఈ సంఘటన తర్వాత మూడు నాలుగు రోజులకు వైద్య పరీక్షలు జరిగాయని చెబుతున్నారని, నిజానికి ఈ వాదనలో అర్థం లేదని, ఇది ఇప్పటికీ ముఖ్యమైందేనని మలివాల్ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ సమయంలో ఢిల్లీ పోలీసు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ "ఆమెను అక్కడ (ముఖ్యమంత్రి నివాసం) వేచి ఉండమని చెప్పినప్పుడు అదే అక్రమ ప్రవేశం ఎలా అవుతుంది, నిబంధనలు అతిక్రమించింది మలివాల్ కాదని, నిజానికి అతిక్రమించింది బిభవ్" అని అన్నారు.
మలివాల్ పై దాడి కేసు...
రెండు వారాల క్రితం ఢిల్లీలో కేజ్రీవాల్ సహాయకుడు కుమార్ తనను "బలంగా కొట్టారు. ఒక్కసారి కాదు అనేక సార్లు కొట్టారు" అని మలివాల్ ఆరోపించినప్పుడు ఢిల్లీలో పెద్ద రాజకీయ వివాదమే చెలరేగింది. ముఖ్యమంత్రి నివాసంలో ఈ సంఘటన జరిగింది. "ఏడెనిమిది సార్లు కొట్టాడని" మలివాల్ బిభవ్ పై ఫిర్యాదు చేశారు.
దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈ ఘటనపై రెండు వేర్వేరు వాదనలు ఉన్నందున సక్రమమైన దర్యాప్తుతో బాధితులెవరో వాళ్లకి న్యాయం జరుగుతుందని చెప్పారు.
Tags:    

Similar News