ధనిక వ్యాపారుల సాధనం మోదీ: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అత్యంత ధనిక వ్యాపారుల సాధనంగా మారిపోయారని ఆరోపించారు.

Update: 2024-04-16 12:04 GMT
దేశంలోని అత్యంత ధనిక వ్యాపారుల సాధనంగా ప్రధాని నరేంద్ర మోదీ మారిపోయారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడం, ధనిక వ్యాపారులకు రక్షణ కల్పించడం, వారి బ్యాంకు రుణాలను మాఫీ చేయడం మోదీ పని.’’ అని రాహుల్ వ్యాఖ్యనించారు. కోయిక్కోడ్ జిల్లాలోని కొడియాత్తూరులో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.
‘‘దేశంలోని 20-25 మందికి రూ. 16 లక్షల కోట్లు ఇచ్చారు. కాని రైతుల సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ఆయన మాట్లాడడం లేదు. ఎన్నికల బాండ్లు ప్రధాని మోదీ ఒక రకమైన దోపిడీ’’ అని రాహుల్ ఆరోపించారు.
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర..
‘‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఇదే అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. వయనాడ్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ఆయన ఏప్రిల్ 15న ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత రెండోసారి నియోజకవర్గానికి వచ్చారు. నెలాఖరులో వాయనాడ్‌లో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసి రోడ్‌షో నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 4,31,770 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
Tags:    

Similar News