ఈ నెలాఖరున నీట్ యూజీ సెట్ కౌన్సిలింగ్?

నీట్ యూజీ సెట్ - 2024 కౌన్సిలింగ్ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Update: 2024-07-06 11:44 GMT

నీట్ యూజీ సెట్ - 2024 కౌన్సిలింగ్ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కొన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నందున.. సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేసేందుకు గత నెలలో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ప్రక్రియను రెండు రోజుల పాటు పాజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

మే 5న జరిగిన నీట్ పరీక్ష పత్రం లీక్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇవాళ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్‌‌ ను అధికారులు పోస్ట్ పోన్ వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్‌ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

ఇక నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా సుబోధ్ సింగ్‌ను తొలగించి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చీఫ్ ఆర్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్యానెల్‌కు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేలా చూశారు.

Tags:    

Similar News