రాష్ట్రపతి vs సుప్రీంకోర్టు: ఎవరు గొప్ప?
న్యాయశాఖ- కార్యనిర్వాహక వ్యవస్థలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నమా? అని రాష్ట్రపతి ప్రశ్నించారు.;
By : The Federal
Update: 2025-05-15 05:55 GMT
సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఓ సరికొత్త పరిణామానికి తెర తీశారు. Article 143 ఆధారంగా రాష్ట్రపతి- న్యాయవ్యవస్థపై శరపరపరంగా ప్రశ్నల వర్షం కురిపించారు. సుప్రీంకోర్టుకు Article 143 ప్రకారం 'ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్' పంపించారు. ఇందులో 14 రాజ్యాంగ సంబంధిత ప్రధాన ప్రశ్నలు ఉన్నాయి – ఇవి రాష్ట్రపతులు, గవర్నర్లు, రాష్ట్రాల శాసనమండళ్ల హక్కుల మధ్య వ్యాసంగాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలు.
ఏమిటి ఈ విభేదానికి నేపథ్యం?
అప్రిల్ 8, 2025న సుప్రీంకోర్టు జస్టిస్ జె.బీ. పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల బెంచ్- తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తీరుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ తన వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉంచడాన్ని ప్రశ్నించింది. అది రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. అంతేకాదు, Article 142 ఆధారంగా “గవర్నర్, రాష్ట్రపతి బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల గడువు విధించింది”. అంటే నిర్ణయం తీసుకోకపోతే, అది 'deemed assent (ఆమోదించినట్టుగా భావించడం) ' అన్న భావనను ఆమోదించింది.
ఈ తీర్పుతో కేంద్రం-రాష్ట్ర సంబంధాల మధ్య రాజ్యాంగ సరిహద్దులు స్పష్టంగా పునర్నిర్వచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి రాజ్యాంగంలోని త్రీ టైర్ వ్యవస్థ – చట్టసభ, కార్యనిర్వాహక, న్యాయవిధానం- మధ్య గల సమతుల్యంపై ప్రభావం చూపే విషయాలు. ‘‘న్యాయశాఖ కార్యనిర్వాహక వ్యవస్థలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నమా?’’ అని రాష్ట్రపతి ప్రశ్నించారు.
రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్లు ఇంగ్లీషు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు ఇవే..
రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?
సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?
రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి?
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు నేరుగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గవర్నర్ Article 200 ప్రకారం బిల్లులపై ఎలా స్పందించాలి?
అధికారాలపై కోర్టులు గడువులు విధించగలవా?
Article 201 ప్రకారం రాష్ట్రపతి చేసే నిర్ణయాలు న్యాయపరంగా విచారణకు లోబయ్యేలా చేయవచ్చా?
Article 142 ద్వారా కోర్టులు వ్యవస్థాపక అధికారాల్ని మార్చగలవా?
ఏమిటీ తీర్పు..
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది.
ఎవరి హోదా ఎంత వరకూ?
ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఏకంగా భారత రాజ్యాంగంపై మళ్లీ సమీక్షకు దారి తీసే అవకాశాన్ని కలిగించింది.
నిర్ణయం ఏమైనా కావచ్చు, కానీ ఇది భారత్ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఒక కీలక మలుపు అవుతుంది. ఇది Article 142పై పునర్ వ్యాఖ్య, Article 200, 201 మధ్య వ్యవస్థలు ఏ మేరకు పని చేయాలనే దానిపై సమీక్షకు తెర తీసింది.