అత్యంత ధనిక పార్టీ పేరు చెప్పేసిన ప్రియాంక

ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బీజేపీని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్ల గురించి ప్రస్తావిస్తూనే..కేవలం 10 ఏళ్లలో బీజేపీ అత్యంత ధనిక పార్టీగా అవతరించిందని ఆరోపించారు.

Update: 2024-05-01 10:31 GMT

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను "మాఫియా రాజ్" గా అభివర్ణించారు. ఆయన అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ధుబ్రీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో అసదుద్దీన్ ఒవైసీతో బిజెపికి ఉన్నట్లే, AIUDFకి చెందిన బద్రుద్దీన్ అజ్మల్‌తో హిమంత బిస్వా శర్మకు "రహస్య అవగాహన" ఉందని, అయితే ఈ రెండూ కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు.

కర్ణాటక ఎంపీ కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కూడా ప్రియాంక మాట్లాడారు. ప్రధాని మోదీ అతడి కోసం ఓట్లను అభ్యర్థించారని, అయితే దేశం విడిచి వెళ్లకుండా ఆపలేకపోయారని అన్నారు.

ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై కూడా ప్రియాంక బీజేపీని ఘాటుగా విమర్శించారు. కేవలం 10 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ అవతరించిందని, అయితే 70 ఏళ్లలో కాంగ్రెస్ ఇంత సంపాదించలేదని అన్నారు.

ప్రధాని మోదీ సామాన్య ప్రజల వాస్తవికతకు దూరంగా ఉన్నారని, అహంభావంతో ఉండడంలో వారి కష్టాలపై ఆయనకు అవగాహన లేదని పేర్కొన్నారు.

అస్సాంలో నిరుద్యోగం పెరిగిపోవడం ప్రధాన సమస్య అని, సీఎం, ఆయన మంత్రులు స్వప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని విమర్శించారు.

Tags:    

Similar News