ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు, ఇది రెండో సారి
మావోయిస్టులతో లింకులన్న కేసులో అరెస్టు అయిన ప్రొఫెసర్ సాాయిబాబా 2017 లోనే 2022లోనే నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. ఇపుడు మళ్లీ పునర్విచారణలో అదే తేలింది.;
మావోయిస్టులతో సంబంధాలున్న ఒక కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ నిర్దోషిగా తేల్చింది.
ఆయనతో పాటు మరొక ఐదుగురికి కూడా ఈ కేసు విముక్తి లభించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం నాగపూర్ బెంచ్ కు చెందిన జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ ఎ మెనెజెస్ తీర్పు చెబుతూ 2017లో సెషన్స్ కోర్టు ఇచ్చిన యావజ్జీవ కారాగార తీర్పు ను కొట్టి వేశారు. నిందితులు రు. 50వేల చూపించి బెయిల్ మీద విడుదల కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే దాకా వారు బెయిల్ మీద ఉండవచ్చునని కోర్టు పేర్కొంది.
2022 అక్టోబర్ 14, హైకోర్టు బెంచ్ ఇలా గే తీర్పు ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టు కొట్టి వేసింది అయితే, ఈ కేసును తాజా గా విచారించేందుకు మళ్లీ హైకోర్టుకే పంపింది.
సాయిబాబు వీల్ చేయిర్ మీద ఆధార పడ్డ వ్యక్తి. వయసు 54 సంవత్సరాలు. ఇపుడాయన మావోయిస్టు కు సంబంధాలున్నాయన్న కేసులో నాగపూర్ సెంట్రల్ జైయిలు లో ఉంటున్నారు.
2017లో గచ్చిరోలి సెషన్స్ కోర్టు ‘రాజ్యం మీద యుద్ధం ప్రకటించిన మావోయిస్టులతో సంబంధాలున్నా’యన్న ఒక కేసులో సాయిబాబా తదితరులకు శిక్ష విధించింది. ప్రజలను హింసకు ప్రేరేపించే నక్సల్ సాహిత్యం సాయిబాబా దొరికిందని, దీనిని అండర్ గ్రౌండ్ లో ఉన్ననక్సలైట్లకు, ప్రజలకు అందించేందుకు తనదగ్గిర ఉంచుకున్నారని కోర్టు పేర్కొంది.
తనను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి లేదన్న సాయిబాబా వాదనను కోర్టు కొట్టివేసింది.
ఆ తర్వాత ఆయన బాంబై హైకోర్టును ఆశ్రయించారు,. దీని మీద 2022 అక్టోబర్ 14 జస్టిస్ రోహిత్ బి దేవ్ విచారించి సాయిబాబా మీద వేసిన కేసులను కొట్టి వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి యుఎ పిఎ (UAPA) చట్టం లోని సెక్షన్ 45(1) ప్రకారం అనుమతి తీసుకోకుండా కేసులు వేసినందుకు సెషన్స్ కోర్టు తీర్పు చెల్లదని జస్టిస్ రోహిత్ పేర్కొన్నారు.
ఈ తీర్పునకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2022 అక్టోబర్ 15న, ఒక ప్రత్యేక విచారణ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేది హైకోర్టును తీర్పు ను కొట్టి వేశారు. వారు సిఆర్ పిసి సెక్సన్ 465 కింద సాయిబాబా మీద వేసిన కేసును కొట్టి వేయలేమని పేర్కొన్నారు. అయితే, 2023 ఏప్రిల్ 19న జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ టిసి రవికుమార్ ల బెంచ్ తాజా విచారణకు ఈ కేసును హైకోర్టు కు తిప్పి పంపింది.
చిత్రమేమిటంటే, సాయిబాబును నిర్దోషి గా ప్రకటించిన జస్టిస్ రోహిత్ దేవ్ 2023 ఆగస్టు 2, తన పదవికి రాజీనామా చేశారు.