‘రామ్‌లీలా’ నాటకం ఎఫెక్ట్‌ : ప్రొఫెసర్‌ సహా విద్యార్థుల అరెస్ట్‌

సీత పాత్రలో కనిపించిన ఓ పురుష కళాకారుడు ఆ పాత్రను అగౌరవపరిచాడు. ఏబీవీపీ కార్యకర్తల ఫిర్యాదుతో మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-02-03 11:00 GMT

పూణే యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్‌, అలాగే ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. రామ్‌లీలా నాటకంలో హిాందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూణే లలితా కళాకేంద్రంలో ‘రామ్‌లీలా’ నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో కొన్ని డైలాగులు, సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఏబీవీపీ కార్యకర్త హర్షవర్ధన్‌ హర్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెక్షన్‌ 295 (ఎ) (మతభావాలను రెచ్చగొట్టడం) కింద లలిత కళా కేంద్రం విభాగాధిపతి డాక్టర్‌ ప్రవీణ్‌ భోలేతో పాటు విద్యార్థులు భవేష్‌ పాటిల్‌, జే పెడ్నేకర్‌, ప్రథమేష్‌ సావంత్‌, రిషికేష్‌ దాల్వీ, యశ్‌ చిఖ్లేపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ అంకుష్‌ చింతామన్‌ తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. నాటకంలో సీతపాత్రలో కనిపించిన పురుష కళాకారుడు సిగరెట్‌ తాగుతూ అభ్యంతరకరంగా డైలాగులు చెప్పడంతో ఏబీవీపీ సభ్యులు నాటక ప్రదర్శనను నిలిపివేశారు. దీంతో కళాకారులు తమపై దాడికి పాల్పడ్డారని ఏబీవీపీ కార్యకర్తలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News