ఆయనకు పాటే ప్రాణం..‌పాటే జీవన పల్లవి..!!

ఈయన మా మంగళగిరి "వాగ్గేయ కారుడు, భక్తిపాటల్లో మేటి..అతనికతనే సాటి, అక్షరమూ అతనిదే..పాటా అతనిదే.. స్వరమే ఆయన వరం..సంకీర్తనలు ఆయన పరం.! వివరాలు...

Update: 2024-04-02 09:51 GMT


-రజా హుస్సేన్



ఈరోజు నేను పరిచయం చేస్తున్న కవి చాలా
ప్రత్యేకమైనవాడు..ఈ కవిది కుడా మా మంగ
ళగిరే..అయితే నేనెప్పుడూ ఈయన్ను గురిం
చి వినడం కానీ,చూడ్డం కానీ జరగలేదు..నేనే
కాదు..మా మంగళగిరిలోనే ఈయన చాలా
మందికి తెలీదు..కారణం ఈయనో సామాన్యు
డు..‌చేనేత కుటుంబానికి చెందిన సీదా సాదా
ఆమ్ ఆద్మీ.ప్రమోషన్,మార్కెటింగ్ చేతకాదు.
ఆ మాటకొస్తే అలాంటివి కూడా వుంటాయన్న
సంగతి తెలీదు.తన పనితాను చేసుకుపోతుం
టాడు..

సరే ఇక అసలు విషయానికొచ్చేద్దాం..!

ఈయన పేరు "అల్లక తాతారావు"చదివింది 
మూడోతరగతే..అయితే మాత్రమేం! జీవితా
న్ని చదివాడు.తెలుగుభాషను ఔపోశన పట్టా
డు.బడికెళ్ళి చదువుకునే అవకాశం కూడా లేని పేదకుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పాయాడు.కష్టాలన్నీ మూకుమ్మడి
గా దాడిచేశాయి.చదువు అటకెక్కింది.బతుకు
ఎదుట నిలిచింది..

కట్ చేస్తే…

చిన్నప్పుడు రేడియోలో విన్న పాటలు మన
సుకు హత్తుకొని,పాటలమీద ఇష్టం కూడా
తనతో పాటే పెరిగింది..తనకు వచ్చిన భాష
లో పాటలు రాయడం మొదలు పెట్టాడు..
రాయడమే కాదు..గొంతెత్తి పాడేవాడు..
అతని స్వరమే వరమైంది.శృతి శుభగంగా
గొంతెత్తి పాడుతుంటే..విన్నవారు చప్పట్లు
కొట్టారు..ఆత్మవిశ్వాసం పెరిగింది.గొంతును
అదుపులోకి తెచ్చుకొని,తాను రాసిన పాట
లనే సొంతంగా ట్యూన్లు చేసుకొని పాడే
వాడు..అలా.‌అలా..రేడియోలో కదంబకార్య
క్రమాల వరకు ప్రస్థానం కొనసాగింది.అప్పట్లో
ఎవరో అయిదువేలిస్తే,తన పాటల్ని క్యాసెట్లో
రికార్డు చేశాడు.కొన్నాళ్ళు ఆ పాటలు దేవ
స్థానంలో మారు మోగాయి‌..అయితే రాను
రాను క్యాసెట్లు మూలపడటంతో ఆ పాటలు
కూడా మూలపడ్డాయి.నిజానికి ఈ కవికి ఎవ
రైనా ప్రోత్సహించి వుంటే ఈ పాటికి పెద్ద సెల
బ్రిటీ అయ్యేవాడే..దురదృష్టం..మాణిక్యాలన్నీ
మట్టిలోనే వుంటాయి.‌వెలికి తీసి,మెరుగుపెట్టే
వారు దొరకనంతవరకు మాణిక్యం విలువ..
లోకానికి తెలీదు..

అమరావతి కవిమిత్రులు(గుంటూరు) వారు
ఈ మాసపు కవిగా ఈయన్ను పిలిచి,పాటలు
పాడించారు.ఆయన పాటలు విన్నవారిలో ..
నేనూ వున్నాను..నిజం చెప్పాలంటే ఈ కవి
గాయకుడు పాడుతున్నంత సేపు అలానే
తన్మయత్వంలో వుండిపోయాను.పాటలు
పాడటం ఒకవంతైతే..ఆ పాటల్ని తానే రాసు
కొని పాడటం మరో ఎత్తు..ముఖ్యంగా పాట
లో అతని గాత్రధర్మానికి,పాట రచనలో సాహి
త్య విలువలకు నేనే కాదు,సభలోవున్నవారం
తా ఫిదా అయ్యారు..ఎస్..అతనో వాగ్గేయ
కారుడు…!!

*భక్తి పాటలకే అగ్రతాంబూలం..!!

ఈ కవి గాయకుడికి భక్తిపాటలంటే ప్రాణం.
ముఖ్యంగా మంగళగిరి లక్ష్మీనృశింహ స్వామి
పై పాటలు రాయడం తన పూర్వజన్మ సృకృ
తంగా భావిస్తాడు.అందుకే ఆ నృశింహుణ్ణి, పానకాల రాయుణ్ణి మనసులో ఆవహించు
కొని "శ్రీ లక్ష్మీ నృశింహ సంకీర్తనలు" అనదగ్గ
పాటల్ని రచించాడు.కమ్మగాగొంతెత్తిపాడాడు.

"మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నృశింహ
వైభవం"అనే 'ఆడియోగీతాల అక్షరమాల
ను'తెచ్చాడు.(ఓ స్పాన్సర్ దయతో)

"ఎక్కడ హరినామ సంకీర్తన వినిపిస్తుందో…
అక్కడ ఆ వైకుంఠ వాసుడు శ్రీలక్ష్మీ ప్రియ
వల్లభుడు ఆనందపరవశుడై నిలిచి వుంటా
డని ఆర్యోక్తి.‌భక్తుల హృదయాల్లోకొలువైన
'మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనృశింహుడు'
యుగయుగాల దేవుడు పానకాలరాయుడు
అంటాడీ కవి..అందుకే తన భక్తినంతా అక్షర
మాలచేసి..ఆ లక్ష్మీ నృసింహుడికి నైవేద్యంగా
సమర్పించాడు…

*ఆ విధంబెట్టిదనిన….

*మంగళాద్రి శిఖరము!!

పల్లవి…

మంగళాద్రి శిఖరము మహాపుణ్య క్షేత్రము
నరసింహుని దర్శనం సర్వ పాప హరణము

*1.చరణం…

ద్వాపరాన ధర్మజుడు ముదమందినామము
కలియుగాన వాసిరెడ్డి రాజవంశతేజము
ముక్కోటి దేవతలకు ఆరాధ్య వేలుపు
అతడే మన దేవుడు లక్ష్మీ నారసింహుడు

*2.చరణం…

విజయవాడ కృష్ణవేణి దక్షిణాన వెలిసిన
విజయహార హాసము మంగళాద్రి క్షేత్రము
చెంచువారి ఇంటి అల్లుడంట అతడు
అతడే మన దేవుడు లక్ష్మీనారసింహుడు

*3.చరణం

కడివెడంత పానకం తడవతడవ పోసిన
బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు
వరమిచ్చును
గజముపైన వీరుడు పానకాలరాయుడు
అతడే మన దేవుడు లక్ష్మీ నారసింహుడు

*4.చరణము…

ఎత్తైన శిఖరముమహా గాలిగోపురము
చూడచూడ మురిపెము విజయాలకు
విదితము
పాల్ఘుణాన పున్నమికి కల్యామ ధాముడు
అతడే మన దేవుడు లక్ష్మీ నారసింహుడు."!!

శ్రీకరం.. శుభకరం.మబ్బులతో దోబూచులాడు
తూ కనబడే ఈ కొండ మంగళగిరికొండ. వర్షా
లు పడితే,చాలు ఒళ్ళంతాపచ్చదనాన్నిపులు
ము..కుంటుంది.(ఆకుపచ్చగామారిపోతుంది)
ఈ కొండకింద పానకాలరాయుడు.కొండపైన
గండాలరాయుడు.మెట్లుదిగి కిందకొస్తేశివాల
యం.ఇంకాస్త ముందుకెళితే శ్రీ లక్ష్మీనరసింహ
స్వామిదేవాలయం.. ప్రవేశ ద్వారంపైనఎత్తెన
గాలిగోపురం.దాని ముందు పెద్దకోనేటికొలను.

ఈ కొండ గురించి జన శ్రుతిలో ఓ ఆసక్తికర
మైన కథ ప్రచారంలో వుంది. కొండనిండా.. భాస్వరం వుందట. భాస్వరానికి మండే గుణ
ముంది.దీనివల్ల ఎప్పటికైనా ఈ కొండ బద్దల
య్యేప్రమాదంవుందట.అందుకే లోన వున్న
భాస్వరం మండకుండా చల్లార్చేందుకు బిలం
లోపానకం పోస్తుంటారు.అంటే...పానకాల
లక్ష్మీనరసింహ స్వామినోట్లోపోసే పానకం.. కొండలోనికి పోయిభాస్వరాన్ని మండకుండా
చల్లారుస్తుందని చెబుతుంటారు.

*అతి పొడవైన సొరంగ మార్గం...!!

ఈ కొండలో వున్న సొరంగ మార్గం విజయ
వాడ కనకదుర్గ గుడిదాకా వుందని కొందరు,
కాదు..ఉండవల్లి గుహల్ని కలుపుతుందని మరికొందరంటారు.మొత్తానికి. ఈ కొండ..
సొరంగమార్గాన్ని కనుగొనగలిగితే...ఎన్నో
కొత్త రహస్యాలు బయటపడతాయి…!!

*నా గానమే నీ పానకం…!!

*పల్లవి ..

నా గానమే నీ పానకం సేవింపుము స్వామి
ఈ హృదయమే నీ కంకితం గైకొనరావేమి?

*1.చరణం

నీ దివ్యరూప దర్శనమే సకలభాగ్యము
నీ భవ్య నామ కీర్తనమే మధురనాదమూ
ఎక్కలేని కొండపైన నీవుంటివి
మా దిక్కు నీవేయని వేడుకొంటిమి
!!నా గానమే!!

*2.చరణము

సిరుల తరణి శ్రీ రమణి హృదయవాసిని
ఆమె చిరునవ్వుల కాంతిలో శాంతమూర్తివి
మంగళాద్రి వాసా ఈ మనవి గాంచుమా
నా హృదయగీతి భువియందున కీర్తి
నిల్పుమా…

!!నా గానమే!!

నైవేద్యంగా పానకం...!!

ఉగ్రనరసింహుడు రూపంలో ఇక్కడ పానకాల
రాయుడు స్వయంభూగా వెలిశాడనిస్థలపురా
ణంచెబుతోంది.యాలకులు,బెల్లం,మిరియాలు
కలిపి తయారుచేసే తియ్యని పానకం ఉగ్రనర
సింహునికిసాంత్వన చేకూరుస్తుందని స్థల…
పురాణం ప్రతీతి! ఈ కవి తన గానాన్నే పాన
కం చేసి అర్పిస్తానంటున్నాడు.ఎక్కలేని ఏను
గు ఆకారంలో వున్న కొండపైన గండాలరాయు
డిలా వేంచేసి వున్నాడు స్వామి..ఈ కొండ పైన గండాల రాయుడి దేవాలయం వుంది. ఈయన్ను దర్శించుకుంటేగండాలన్నీ తొలిగి
పోతాయని జనం చెప్పుకుంటూ ఉంటారు
అయితే ఈ గండాలరాయుడ్నిదర్శించుకోవా
లంటే అనేక గండాలు దాటి వెళ్ళాలి .గండాల
రాయుడి దర్శనం ఎంతో కష్టసాధ్యమైంది.
సరైన దారి లేకపోవడంతో అక్కడి దాకా నడిచివెళ్ళడం కష్టంతో కూడుకున్న పని.
మా చిన్నతనంలో తిరునాళ్ళు,ముక్కోటి ఏకాదశి సందర్భాల్లో కాలిబాటన అతికష్టం మీద కొందరుసాహసికులు గండాలరాయుడి దగ్గరకు వెళతారు.
ఇలా ఓ సారి నేను కూడా అక్కడికి వెళ్ళాను.కొండమీద విశాలంగా
చదును చేశారా? అన్నట్లుంది.అక్కడ నిల్చొని చూస్తే విజయవాడ,కృష్ణమ్మాకనిపిస్తాయి.ఇక మంగళగిరి అయితే బహుసుందరంగాకనిపి
స్తుంది.అటువంటి మంగళాద్రివాసా!ఇదిగో నా హృదయగీతి..స్వీకరించి,మమ్మల్ని చల్లగా చూడుస్వామీ అంటూ..వేడుకుంటున్నాడీ కవి..!!

*మేలుకొలుపు!!

*పల్లవి..

శేష పానుపు పైనా శయనించినా అయ్యా
తెలవారుచున్నాది నిదురలేవయ్యా
మంగళాగిరి వాసా మముగన్న మహిపోషా
శ్రీ రాజ్య లక్ష్మీ స(మేత) నిదురలేవయ్యా.?
!!మంగళా!!

*1చరణం…

కొమ్మ కొమ్మన పూచె విరులన్ని విప్పారే
గూటి గూటిన చేరె గువ్వలే అలరులే
కరిమేఘ తిమిరాలు కడతేర్చు కిరణాలు
తెరతీయమని కోరె సుప్రభాతము పాడె
మంగళాగిరి వాసా మముగన్న మహిపోషా
!!మంగళా!!

*2.చరణం

మగత నిద్దరలోనా ఝళిపించకూ జూలు
నగవు నయనములతోను వెలిగించులోకాలు
పాపాలు పరిమార్చి పాలించరావయ్యా
పానకాలు స్వామి మముకావ రావేమి?
!!మంగళా!!

స్వామీ..తెల్లారుతోంది..ఇక చాలు నిదురలేవ
య్యా..మగత నిద్దరలో జూలు ఝళిపిస్తా
వేమో? అలాచేయకు స్వామీ.భక్తులు భయ
పడతారు.‌ఉదయం అవుతోందనికొమ్మకొమ్మ
కూ పూలు పూచాయి‌..నీ సుప్రభాతపూజ
కోసం.తౄరతీయగరాదా! అంటూ సుప్రభాత
సేవకు అన్నీ సిధ్ధమయ్యాయి..ఇక నిద్దురలే..
సామి అంటున్నాడు కవి తాతారావు.

*మంగళాగిరి ధరణి!!

*పల్లవి…

ఏల వలచితివమ్మ ఆ మోమును
నగవైన కనరాని వధ రాయుని
ఏల కొలిచితివమ్మ ఆ మూర్తిని
శాంతమే ఎరుగని మృగధీరుని
. !!ఏల !!

సౌర్యాన సౌందర్య మొలికింటినావ
సొగసైన నగవులే కురిపించినావ
అసుర సంహారుడగు ఆవేశధారునికి
అధరాన పానకం అందించినావ
మధురానుభూతులే కలిగించినావ
. !!ఏల!!

సుకుమారివే నీవు సుగుణాలవల్లి
సకల సిరులకు నీవు బహు కల్పవల్లి
శ్రీ నారసింహునకు ప్రియరాణివైతివి.
మరువకు మమ్ముల క్షీరసాగర తనయి
మంగళాగిరిధరణి శ్రీ రాజ్యలక్ష్మి

!!ఏల!

ఈ కవి భావుకతకు ఈ పాట కొలమానం..
నరసింహస్వామి.‌.సగం నరుడు.సగం
మృగం..…అటువంటి నృసింహుణ్ణి ఎలా
వరించావమ్మా.శాంతమంటె ఏమిటో తెలీని
మృగదీరుడతడు.‌.ప్రేమించే ముందు ఇవేమీ
ఆలకించలేదా! అయ్యో తల్లీసుకుమారివే
నీవు సుగుణాలవల్లిసకల సిరులకు నీవు బహు కల్పవల్లివి‌.మమ్ముదయచూడుతల్లీ
అంటూ వేడుకుంటున్నాడు కవి..ఇది ఓరకం
గా నిందా స్తుతి…!

*గగనమంత కీర్తిగా…

*పల్లవి..

గగనమంత కీర్తిగా జగతినంత కాంతిగా
వెలిసాడు మంగళగిరి వాసుడు
మమ్మేలే పానకాలరాయుడు

*1.చరణం…

ఈ గిరిపై ఆదిలక్ష్మి తపమొందెనని
ఈ భువిపై సుఖశాంతులు నిలిపేనని
దుష్ట నాశపాలకునికి పానకం పోసెనని
శిష్టదాస కోటికి సకల శుభములొసగేనని
!!గగన!!

*2 చరణం

పాపాలను హరియించే పరమాత్ముడని
శాపాలను తొలిగించే ఇలవేల్పుడని
నమ్మి కొలుచు భక్తుల యెద సదా నిలుచు
దైవమని…..
వమ్ముకాని నమ్మకమున నరసింహుని వేడెదమని..
!!గగన!!

*3.చరణ…

మంగళాద్రి శిఖరమే మణిమకుటమని
నింగినంటు గోపురమే చూడాలని
శిరములెత్తి చూచినా సిగపాగలు ఊడునని
మహా గాలిగోపురమే‌ మహిమాన్విత రూపమని…
!!గగన!!

మంగళగిరి గాలిగోపురం మహిమాన్విత రూపం.దక్షిణాదిలోనే రెండో ఎత్తైన గాలి
గోపురం ఇది..ఈ గోపురాన్ని చూడాలంటే
తలపైకెత్తి చూడాల్సిందే.అంత ఎత్తువుం
టుందీ గోపురం.‌అసలు మంగళగిరి కొండే
ఓ మణి మకుటం.‌ఇక గాలిగోపురం గురిం
చివేరే చెప్పాలా?ఈ కొండపైనే ఆదిలక్ష్మి తపస్సుచేసిందని చెబుతారు‌.

*శ్రీ గాలిగోపురం…!

పల్లవి

నారాయణుడే విశ్వరూపుడే నిలిచిన అవతారం…
శ్రీ గాలిగోపురం మంగళాద్రి గోపురం
!!శ్రీ గాలి గోపు!!

*1.చరణం..

కవులకు అందని కల్పనగా
శిల్పులు మలచని రూపముగా
విశ్వమంతటా కీర్తి కాంతగా
నిలిచిన అవతారం
!!శ్రీ గాలిగోపు!!

*2.చరణం…

క్షణమే గాంచిన చాలునట
ఎన్నో నోముల పుణ్యమట
విశ్వమంతటా కీర్తికాంతిగా
నిలిచిన అవతారం
!!శ్రీ గాలిగోపు!!

*3చరణం…

శ్రీ నారసింహుని శుభకరము
సిరిసంపదలే ప్రతిఫలము
మోక్ష వీక్షుడే లక్ష్మీనాధుడే
నిలిచిన అవతారం..
!!శ్రీ గాలిగోపు!!

సాక్షాత్తు ఆ నారాయణుడే విశ్వరూపుడై నిలిచిన అవతారం ఈ గాలిగోపురం …
మంగళాద్రి గోపురం.దక్షిణాదిలోనే ఎత్తెన గాలిగోపురం కొండపైనగండాలరాయుడు.‌
కొండకింద శ్రీలక్ష్మీనృసింహస్వామి,మధ్యలో
పానకాలరాయుడు..దిగువున శివుడు..ఒహ్ ! ఒకటేమిటి? చూడ్డానికిరెండు కళ్ళు చాలని ఆత్యాత్మిక కేంద్రం ఈ మంగళగిరి..ఒక్క క్షణం
నృసింహుడ్ని కళ్ళారా చూస్తేచాలు అన్ని
పాపాలు పోతాయన్నది భక్తుల నమ్మకం…
అసలు కవులకే అందని కల్పనగా, శిల్పులు
కూడా మలచలేని రూపంగావిశ్వమంతటా కీర్తి కాంతగానిలిచిన అవతారం ఈ గాలిగోపుర
మంటున్నాడు కవి తాతారావు..

*సామాజికం…
( చే )నేతన్న.!!

*టిక్కు టిక్కూ నేతన్న ఎంత ఘనుడ నీవన్న
మానవాళి మానరక్షణ ప్రాణదాత నీవన్న
!!టిక్కు!!

సన్నా సన్నాని నూలు దారాలతోటి
రంగూరంగుల వలువల వస్త్రాలు నేసి
అంగాంగ అందాల వన్నెలు సమకూర్చినావు
నాగరికా ప్రపంచాన ఎన్నో అభిరుచు
లూరించేవు..
!!టిక్కు!!

వధూవరుల మధుపర్క శోభ నిపుణి నీవు
ఆలయాల దైవ ప్రతిమ పీతాంబర సొగసు నీవు…
అర్ధగుంట నేతవై అర్ధాకలి కనిపించనీవు
నగ్న దోష నివారివై నిత్యమూ శ్రమియిం
చేవూ…
!!టిక్కు!!

ఈ కవి భక్తిపాటలే కాదు..సామాజిక పాటలు
కూడా రాస్తాడు.తన కులవృత్తియైన చేనేత
మీద రాసిన పాట ఇది..మగ్గం ఆడుతుంటే
టిక్కూ టిక్కూ అంటూ శబ్దం వస్తుంది.‌….

మగ్గంమీద సన్నని నూలును వస్త్రాలుగా.. నేస్తాడు.‌ఆ వస్త్రాలతో లోకంలోని మానవాళి
మానం కాపాడుతున్న దైవం ఈ నేతకారుడు.
రంగురంగుల వస్త్రాలు నేసి,నాగరిక ప్రపంచం
లో ఎన్నో అందాలను సృజించే సృజనకారు
డు నేతన్నే అంటున్నాడు కవి తాతారావు..
వధూవరులమధుపర్కాలేకాదు..దేవాలయాల్లోని దేవతలకు పీతాంబర వస్త్రాలను కూడా
నేస్తాడు. మగ్గం అర్ధ గుంటలోకూర్చొని నేసే
నేతన్న అర్ధాకలితోనే మలమల మాడిపోతు
న్నాడు.‌పేదరికంలో మగ్గిపోతున్నాడు.‌అయి
నా కూడా కులవృత్తిని మానుకోకుండా లోకా
నికి వస్త్రదానం చేస్తున్ననేతన్న ను గురించి
ఎంత చెప్పినా తక్కువే అంటున్నాడు ఈ
కవి గాయకుడు తాతారావు.!!



Tags:    

Similar News