అనంత్ అంబానీ పెళ్లిలో రిహాన్నా పాడిన పాట ఇదే..

అనంత్ అంబానీ, రాధిక పెళ్లిలో పాప్ సెన్సేషన్ రిహానా ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనంతరం నవ వధూవరులకు విష్ చేశారు.

Update: 2024-03-02 14:16 GMT
Source: Twitter


సాధారణంగానే ధనవంతుల ఇళ్లలే వేడుకలంటే హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. అందుకు ఆ పార్టీలకు విచ్చేసే తారలు, ప్రముఖులే ప్రధాన కారణంగా ఉంటారు. అయితే ముఖేష్ అంబానీ ఈయన ఇమేజ్ విషయంలో ఏ స్టార్ హీరో, హీరోయిన్‌కి ఏమీ తీసిపోరు. ముఖేష్ అంబానీ ఏం చేసినా సంచలనంగా ఉంటుంది. అటువంటి ముఖేష్ అంబానీ ఇల్లు ప్రస్తుతం పెళ్లి సందడితో నిండిపోయి ఉంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాధిక త్వరలో మూడు మూళ్ళ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారి ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ పార్టీకి దేశ, విదేశాలకు చెందిన సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేశారు. వారిలో పాప్ సెన్సేషన్ రిహానా కూడా ఒకరు. ఈ వేడుకలో పాల్గొన్న రిహానా త్వరలో ఒక్కటికానున్న అనంత్, రాధిక జంట కోసం స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో తన ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్‌తో మంటపుట్టిచ్చారు. దీంతో అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ పార్టీలో రిహానా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె పాటకు పార్టీకి వచ్చిన అతిథులంతా ఉత్సాహంతో ఊగిపోయారు.

రిహానా పాడిన పాటలు ఇవే

మూడు రోజులు సాగనున్న అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ పార్టీలో రిహానా తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఇందులో ఆమె పాడిన పాట్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అవే మోస్ట్ పాపులర్ ‘వర్క్, డైమండ్స్, వైల్డ్ థింగ్స్’ను పర్ఫార్మ్ చేసి అతిథులకు కనువిందు చేశారు. ఆమె ప్రదర్శనతో పార్టీలో కొత్త హుషారు వచ్చింది. వధూవరులు సహా అతిథులంతా ఎంతో ఎంజాయ్ చేశారు. ఆమె పర్ఫార్మెన్స్‌ను సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు. రిహానా పర్ఫార్మెన్స్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రిహానా మరోసారి తన మార్క్ చూపిందని, వేదిక ఏదైనా రిహానా వస్తే ఆ లెక్కే వేరుంటదని నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రిహానా పర్ఫార్మెన్స్‌ను తాము చాలా బాగా ఎంజాయ్ చేశామని ఆ పార్టీకి విచ్చేసిన సెలబ్రిటీలు చెబుతున్నారు.

ఎంతో సంతోషంగా ఉంది

అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ పార్టీలో తాను స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంపై రిహానా సంతోషం వ్యక్తం చేశారు. ‘‘అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు. అనంత్, రాధిక వివాహ వేడుకలో పాల్గొనడం సంతోషకరం. వివాహబంధంలోకి అడుగుపెడుతున్న నవ దంపతులు అనంత్, రాధికకు ఆల్ ది బెస్ట్. దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి’’అని రిహానా పోస్ట్ పెట్టారు. అయితే అనంత్, రాధిక వివాహ వేడుకలో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రిహానాకు రూ.76 కోట్ల పారితోషికం ఇచ్చారన్న వార్తలు తెగ వినిపిస్తున్నాయి. మూడు రోజులు సాగే ఈ వివాహ వేడుకల్లో రిహానా చాలా స్పెషల్‌గా నిలవడానికి అదే కారణమని కథనాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఇటు రిహానా కానీ, అటు అంబానీ కుటుంబీకులు కానీ స్పందించలేదు. ఏది ఏమైనా అనంత్, రాధిక వివాహ వేడుకలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి.



Tags:    

Similar News