హిండెన్ బర్గ్ కు నోటీసులు జారీ చేసిన ‘సెబీ’
అదానీ గ్రూప్ పై తప్పుడు ఆరోపణలు చేసిన హిండెన్ బర్గ్ కు సెబీ నోటీసులు జారీ చేసింది. అయితే వీటిని ఆ సంస్థ ఖండించింది. తమను భయపెట్టే చర్యగా వీటిని అభివర్ణించింది.
By : The Federal
Update: 2024-07-02 05:49 GMT
స్టాక్ మార్కెట్ మానిప్యూలేషన్, అకౌంటింగ్ లో మోసాలకు పాల్పడి అదాని గ్రూప్ తన షేర్ విలువను పెంచుకుంటున్నట్లు ఆరోపణలు చేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థకు సెబీ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై హిండెన్ బర్గ్ సంస్థ వితండవాదనలకు దిగింది. నోటీసులను నాన్ సెన్స్ గా అభివర్ణించింది. అదానీ గ్రూప్ మోసాలకు పాల్పడినట్లు మొండి వాదనకు దిగింది. జూన్ 27 న సెబీ నుంచి తమకు ఇ మెయిల్ వచ్చిందని, అందులో నోటీస్ ఇచ్చినట్లు, ఇది తమకు అవమానకరం అని విమర్శించింది.
భారత్ లోని పెద్ద కార్పొరేట్ కంపెనీల మోసాలను బయటపెట్టినందుకు, నోటీసులను ఇవ్వడం ద్వారా భయపెడుతున్నారని అభివర్ణించింది. ముందే నిర్దేశించిన ప్రకారం దీనిని రూపొందించారని విమర్శించింది. అదాని గ్రూప్ దశాబ్దాలుగా స్టాక్ విలువను పెంచుకోవడానికి మ్యానిప్యూలేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ కు పాల్పడుతోందని, ప్రస్తుతం ఉన్న స్టాక్ విలువ నిజం కాదని ఓ తప్పుడు రిపోర్ట్ ను హిండెన్ బర్గ్ బయటపెట్టింది. దీని వల్ల అదానీ గ్రూప్ వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. కోటక్ బ్యాంక్ ఆఫ్‌షోర్ ఫండ్ ను సృష్టించి, పర్యవేక్షించిందని, దాని "పెట్టుబడిదారు భాగస్వామి" సమ్మేళనానికి వ్యతిరేకంగా ఉపయోగించారని పేర్కొంది. అయితే బ్రేక్ ఈవెన్ కంటే తక్కువగా ఉండవచ్చని ఆరోపించింది.
అదానీ తిరస్కరణ
హిండెన్ బర్గ్ చేసిన అన్ని ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. ఇదే విషయాన్ని సెబీ కూడా తాజా విచారణలో గుర్తించింది. దాదాపు సంవత్సరన్నర తరవాత అనేక పరిశోధనలు చేసిన సెబీ ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపింది. అయితే సెబీ, అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై కూడా హిండెన్ బర్గ్ కూడా ఆరోపణలకు దిగింది. సెబీ కూడా అదానీ గ్రూప్ తో చేతులు కలిపిందని, భారతీయ ఇన్వేస్టర్లను మోసం చేస్తోందని వితండ వివరణను హిండెన్ బర్గ్ వెల్లడించింది. తప్పుడు పనుల ద్వారా మేము ఎలాంటి సంపదను సృష్టించడం లేదని అర్థం లేని ఆరోపణలు గుప్పించింది.
ఈరోజు వరకు తాము లేవనెత్తిన అనేక అంశాలకు అదానీ గ్రూప్ ఎలాంటి వివరణ ఇవ్వలేకపోయిందని, కానీ మాకు మాత్రం నోటీసులు ఇచ్చారని పేర్కొంది. "ఈ సంస్థల ద్వారా రహస్యంగా బిలియన్లు ఎలా తరలించబడ్డాయో మేము వివరించాము, అదానీ పబ్లిక్ , ప్రైవేట్ సంస్థలలోకి నిధులు తరలించారని ఆరోపించింది. మా సంస్థ భారతీయ సంస్థ కాదని, ఇక్కడ భారతీయ ఉద్యోగులు లేరని, చట్టపరమైన క్లెయిమ్ చెల్లవని దురుసుగా పేర్కొంది. సెబీ నోటీసులో హిండెన్‌బర్గ్‌కు సంబంధాలు ఉన్న కోటక్ బ్యాంక్ పేరు "స్ఫష్టంగా" లేకపోవడాన్ని కూడా ఈ అమెరికా సంస్థ తప్పుపట్టింది.
"కోటక్ లేదా మరే ఇతర కోటక్ బోర్డ్ మెంబర్ గురించి సెబీ ప్రస్తావించకపోవడం, మరో శక్తివంతమైన భారతీయ వ్యాపారవేత్తను పరిశీలన నుంచి రక్షించడానికి ఉద్దేశించబడుతుందని మేము అనుమానిస్తున్నాము, ఈ పాత్రను సెబీ స్వీకరించినట్లు అనిపిస్తుంది" అని హిండెన్‌బర్గ్ విమర్శించింది.