వారి అభిప్రాయం మేరకే ఎంపీ అభ్యర్థుల ఎంపిక: కర్ణాటక సీఎం

లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను ఏ ప్రతిపాదికన ఎంపిక చేస్తున్నారు? సీఎం సిద్ధరామయ్య జాబితాను ఎవరిని అడిగి ఫైనల్ చేస్తున్నారు?

Update: 2024-03-06 11:00 GMT

కర్ణాటకలో ఎంపీ అభ్యర్థుల జాబితాను రెండు-మూడు రోజుల్లో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి గందరగోళంకాని, వివాదం కాని లేవని చెప్పుకొచ్చారు. పార్టీ స్థానిక నేతల అభిప్రాయం మేరకే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు.

‘‘రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. కర్ణాటక అభ్యర్థులను కూడా రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసి ప్రకటిస్తాం’’ అని సిద్ధరామయ్య కార్వార్‌లో విలేకరులతో అన్నారు. అభ్యర్థుల ఎంపికలో వివాదాలేమి లేవంటూనే.. ఈసారి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, పరిశీలకులు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, బ్లాక్‌ కమిటీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటున్నాం.’’ అని చెప్పారు.

ఇదిలా ఉండగా ఏఐసీసీ అధ్యక్షుడు ఎం. మల్లికార్జున్‌ ఖర్గే నేతృత్వంలో గురువారం దేశ రాజధానిలో సమావేశమయ్యాకమ, జాబితాను ఖరారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ హుబ్బళ్లిలో తెలిపారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలకు 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, ఆ పార్టీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు.

అప్పటి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని కాంగ్రెస్, జెడి (ఎస్) కలిసి ఎన్నికల్లో పోరాడి ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది.

అయితే తర్వాత సీన్ మారిపోయింది. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

గత ఏడాది సెప్టెంబరులో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో చేరిన జెడి(ఎస్)కి ఇది ఒక రకమైన రోల్ రివర్సల్. ఆ పార్టీ ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఏర్పాటుపై బిజెపితో చర్చలు జరుపుతోంది.

Tags:    

Similar News