కాగజ్ నగర్ కారడవిలో పులి హత్య?

విషప్రయోగం జరిగిందని అటవీ శాఖ అధికారుల అనుమానం. విషం కలిపిన జంతుమాంసం ప్రయోగించి పులిని చంపిఉంటారని అనుమానం...

Update: 2024-01-09 12:00 GMT

కొమరంభీమ్ ఆసిఫా బాద్ జిల్లా  కాగజ్‌నగర్ పరిధిలోని దరిగావ్ బీట్‌లో పులి మృత దేహం కనిపించింది.  దీని వయసు సుమారు 5-6 సంవత్సరాలుంటుందని, ఇది మగ పులి అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రదేశం  కాగజ్ 

నగర్ నుండి సుమారు  సుమారు 8 కి.మీ దూరాన ఉంటుంది. పులి మృత దేహం సమాచారం తెలియగానే ఉన్నతాధికారులు  ఆర్ ఎం డోబ్రియాల్, ఎంసి  పర్గైన్ లు,   వెటర్నరీ సర్జన్లతో సహా అటవీ సిబ్బందిత ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఇలాగే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అధారిటీ నియమించిన బృదం కూడా ఈ  ఈ స్థలాన్ని పరిశీలించింది.

 ఇక్కడి ఒక  వాగు సమీపంలో పులి చనిపోయి కనిపించిందని,  దాని మెడ చుట్టూ వదులుగా ఉన్న ఉచ్చు కూడా ఉందని అటవీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

.విష ప్రయోగం వల్ల ఈ పులి చనిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

తదుపరి విచారణ కోసం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపుతున్నారు. NTCA నిబంధనల ప్రకారం పులి మృత దేహాన్ని సంస్కారాలు చేశారు. అక్కడ చచ్చి పడివున్న పశువుల మృతకళేభరాలను బట్టి  పులి మీద  విషప్రయోగం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అడవిషప్రయోగానికి కారణమయిన  నిందితుడిని పట్టుకునేందుకు స్థానిక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో తదుపరి ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది.

Tags:    

Similar News