అమెరికాలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువకుడు!

అమెరికాలో ఇటీవల ఓ సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో గాయపడిన తెలుగు యువకుడు గోపీకృష్ణ.. ఈరోజు ఉదయం మరణించాడు.

Update: 2024-06-23 08:00 GMT

అమెరికా తన గన్ కల్యార్‌ పెట్టింది పేరు. ఆఖరికి ఆ దేశ అధ్యక్షుడు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేశారంటే అక్కడ గన్ కల్చార్ ఎంత ప్రబలిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు కొంతకాలంగా అమెరికా ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి పెద్దపెద్ద కారణాలు కూడా ఏమీ ఉండటం లేదు. అటువంటి ఘటనే ఒకటి అమెరికా డాలస్‌లో చోటు చేసుకుంది. ఓ జనరల్ స్టోర్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు.. కౌంటర్‌లో ఉన్న యువకుడిపై కాల్పులు జరిపాడు. ఆ యువకుడు కుప్పకూలాడు. వెంటనే కౌంటర్‌లోకి దూకిన దుండగుడు సిగిరెట్ ప్యాకెట్ తీసుకుని పారిపోయాదు. ఇదంతా స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే ఒక సిగిరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు జరిపి ఒక ప్రాణం తీయడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మన తెలుగు కుర్రాడు. ఉన్నత విద్య కోసమని అమెరికా వెళ్లిన అతడు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు. అతడి పేరు గోపీ కృష్ణ.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ(32) ఉన్నత విద్య కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన గోపీ.. మంచి ఉద్యోగం కూడా ప్రతయ్నాలు కూడా చేస్తున్నాడు.ప్రస్తుతం అక్కడి అవసరాల కోసం ఆర్కెన్సాస్‌లని ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. ఎప్పటిలానే శనివారం కూడా గోపీ కృష్ణ తన ఉద్యోగానికి వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ దుండగుడు ఒక్కసారిగా షాప్‌లో వచ్చి గోపీకృష్ణపై పలుసార్లు కాల్పులు జరిపి అనంతరం ఒక సిగిరెట్ ప్యాకెట్ తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనలో గోపీకృష్ణ తీవ్రంగా గాయపడి కుప్పకూలాడు. అది గమనించి ఇతర స్టోర్ సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం గోపీకృష్ణ ప్రాణాలు విడిచాడు.

నిందితుడు మైనర్

గోపీకృష్ణ హత్య ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు వయసు కేవలం 16ఏళ్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే కేవలం సిగిరెట్ ప్యాకెట్ కోసమే కాల్పులు జరిపాడా? లేకుంటే అతడి దాడి వెనక మరేదైనా కారణం ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

Tags:    

Similar News