4జీ నెట్‌వర్క్‌లో BSNL వెనకబడటానికి కారణం చెప్పిన కేంద్ర మంత్రి

‘‘BSNL లో ఇతర దేశాల పరికరాలను కాకుండా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయిన పరికరాలను ఉపయోగించాలన్నది ప్రధాని నిర్ణయం" - కేంద్రం మంత్రి సింధియా

Update: 2024-08-03 12:05 GMT

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. రిలయన్స్, ఎయిర్‌టెల్ కంపెనీలు ఇటీవల టారీఫ్ పెంచేశాయి. ఇదే సమయంలో BSNL ప్రవేశపెట్టిన టారిఫ్‌కు వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. ‘ఇక 4G నెట్‌వర్క్ కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. 5G సేవల్లోనూ కాంపిటీటర్లతో పోటీపడతాం’ అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

పూర్తిగా స్వదేశీ స్వదేశీ పరిజ్ఞానంతో..

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ 4G నెట్‌వర్క్‌తో పనిచేస్తున్నపుడు..BSNL ఎందుకు వెనకబడి ఉందని అడిగిన ప్రశ్నకు..‘‘ BSNL ప్రభుత్వ రంగ సంస్థ. భారత ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ కావడంతో అభివృద్ధి చేయడానికి ఇతర దేశాల పరికరాలను కాకుండా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయిన పరికరాలను ఉపయోగించాలన్నది ప్రధాని నిర్ణయం" అని సింధియా సమాధానమిచ్చారు.

మార్చి 2025 నాటికి లక్ష టవర్లు..

స్వదేశీ సాంకేతికతతో 4G నెట్‌వర్క్ సిద్ధమవుతోందని చెప్పారు. ఇందుకు అవసరమైన రేడియేషన్ యాక్సెస్ నెట్‌వర్క్ (RAN) టవర్‌లను ఆత్మనిర్భర్ భారత్ కింద తయారు చేస్తుందన్నారు. నెట్‌వర్స్‌లో స్వదేశీ సాంకేతికతతో పనిచేసే ఐదో దేశంగా భారత్ అవతరించబోతుందని పేర్కొన్నారు. అక్టోబర్ చివరి నాటికి 80వేల టవర్లను, వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 21వేల టవర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తంగా మార్చి 2025 నాటికి లక్ష టవర్లతో 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక 5జీ సేవల కోసం టవర్లలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు.

Tags:    

Similar News