కర్ణాటక ఆర్టీసీ బస్సులో పక్షులకు టికెట్..

కర్ణాటకలో ఆడవాళ్లు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాని పక్షులు, కుందేళ్లును వెంట తీసుకెళ్లే మాత్రం టికెట్ చెల్లించాల్సిందేనని కండక్టర్లు రూల్స్ చెబుతున్నారు.

Update: 2024-03-28 13:25 GMT
మార్కెట్‌లో పక్షుల్ని చూసి పెంచుకుంటాననడంతో మనవరాలి కోరిక కాదనలేకపోయింది అమ్మమ్మ. వాటిని కొని ఊరికి బస్సెక్కారు. ఇంతలో టికెట్.. టికెట్ అంటూ కండెక్టర్ వచ్చాడు. అమ్మమ్మకు, తన మనవరాలికి జీరో టికెట్ ఇచ్చిన కండెక్టర్.. పక్షికి రూ. 111కి చొప్పున లెక్కకట్టి నాలుగింటికి రూ. 444 టికెట్ కొట్టి అమ్మమ్మ చేతిలో పెట్టాడు. ఇదేంటని అడిగిన అమ్మమ్మకు కండక్టర్ చెప్పిన రూల్ విని దిమ్మతిరిగింది. చేసేదేం లేక పక్షుల కోసం టికెట్ ధర చెల్లించింది. ఇది కర్ణాటకలో జరిగింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే 'శక్తి యోజన' కింద మహిళలు, ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పగ్గాలు చేపట్టిన హస్తం పార్టీ ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తుంది. అందులో భాగంగానే అమ్మమ్మకు, తన మనవరాలికి కండెక్టర్ టికెట్ కొట్టలేదు.
1 పక్షికి రూ.111 టిక్కెట్..
బుధవారం (మార్చి 27) ఉదయం 08-18 గంటలకు అమ్మమ్మ, మనవరాలు KSRCT బస్సులో మైసూరుకు బయలుదేరారు. ఇద్దరికి జీరో టికెట్ ఇచ్చిన కండెక్టరు.. పక్షులకు టికెట్ తీసుకోవాలని అడిగాడు. ఎందుకు అని అడిగిన అమ్మమ్మకు ఆర్టీసీ రూల్స్ గురించి చెప్పాడు. మనవరాలి కోసం పక్షులను వదులుకోలేక నాలుగు పక్షులకు కలిపి రూ.444 చెల్లించింది.
పెంపుడు జంతువులకు టికెట్ తప్పనిసరి..
పెంపుడు జంతువులైన కుక్కలు, పక్షులు, కుందేళ్లు, పిల్లులు పట్టణ, సాధారణ, సబర్బన్, ఎక్స్‌ప్రెస్ బస్సులో అనుమతిస్తారు. అయితే వాటికి టికెట్ తీసుకోవాలన్న నిబంధన ఉంది. ఇది తెలియక బస్సెక్కిన అమ్మమ్మ, ఆమె మనవరాలు.. నాలుగు పక్షులకు రూ.444 చెల్లించాల్సి వచ్చింది. నాలుగు పక్షులను నలుగురు పిల్లలుగా పరిగణించిన టికెట్ కండక్టర్ ఆ మొత్తాన్ని అమ్మమ్మ నుంచి రాబట్టుకోగలిగాడు. అసలు ఇలా పక్షులకు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసి ఉంటే.. అమ్మమ్మ అసలు పక్షుల జోలికి వెళ్లేది కాదేమో.. ఈ టికెట్ ఇష్యూ వ్యవహారం ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతోంది. ఇక ముందు పెంపుడు జంతువులను బస్సుల్లో తీసుకెళ్తే మనకు బదులు వాటికి టికెట్ తీసుకోవాలంటా మహిళలు సెటైర్లు విసురుతున్నారు.
Tags:    

Similar News