ఉపరాష్ట్రపతి రాజీనామాలో తెరవెనక ఏం జరిగింది?

ఆరోగ్య కారణాలే కారణమా? ఇంకేదైనా ఉందా?;

Update: 2025-07-22 07:47 GMT
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్

దేశంలోని రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉంటూ, ఇటీవల కాలాల్లో సుప్రీంకోర్టు తీరుపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించి వార్తల్లో నిలిచిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేశారు. తనకు ఆరోగ్యం సహకరించకపోవడం వలన వైద్యుల సూచన మేరకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి ఆయన రెండు సంవత్సరాల పదవి ఉండగానే రాజీనామా చేశారు. ఈ ప్రకటనపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో ప్రధానాంశంగా మారిన అపనమ్మకం, సందేహ రాజకీయాల వాతావరణంలో కొన్ని బయటకు రావడం లేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం ధన్ ఖడ్ రాజీనామాను సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ముర్ముకు పంపినట్లు తెలిసింది.
యశ్వంత్ వర్మ కేసు..
రాజ్యసభకు అధ్యక్షత వహిస్తూ ఐదు గంటల లోపే ధన్ ఖడ్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. అలహబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించాలని కోరుతూ 68 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేసిన నోటీస్ తనకు అందిందని తాను కూడా దానికి అంగీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ధన్ ఖడ్ ప్రకటన ప్రభుత్వానికి ఊహించని విధంగా తెలిసిందని చాలామంది భావిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన అగ్ని ప్రమాదంలో జస్టిస్ వర్మ అధికారిక నివాసం నుంచి కరెన్సీ నోట్ల కుప్పలు బయటపడటంతో కేంద్రం ఆయను అభిశంసనను వ్యతిరేకించలేదు కానీ చొరవ మాత్రం తీసుకోలేదు. కానీ రాజ్యసభ చైర్మన్ తనకు అందినట్లు చెబుతున్న నోటీసు పూర్తిగా ప్రతిపక్షాల చొరవ వల్లే సాధ్యమైంది.
నెల రోజుల వర్షాకాల సమావేశాల మొదటి రోజు పార్లమెంట్ సమావేశమైన అదే రోజు జస్టిస్ వర్మను తొలగించాలనే తీర్మానానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహ 150 మందికి పైగా ఎంపీల ద్వైపాక్షిక మద్దతును కోరుతూ కేంద్రం లోక్ సభలో అసాధారణమైన మలుపుతో ఇలాంటి కార్యకలాపాలను ప్రారంభించింది.
ప్రభుత్వానికి షాకింగ్..
జస్టిస్ వర్మ కేసులో ప్రతిపక్షం నోటీస్ పై ధన్ ఖడ్ తొందరపడి వ్యవహరించడం ఆశ్చర్యకరం. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శేఖర్ యాదవ్ ను తొలగించాలని కోరుతూ ప్రతిపక్షం నోటీస్ ఇచ్చిన ఏడు నెలలు గడిచినప్పటికీ అది పెండింగ్ లో ఉంది.
ట్రెజరీ బెంచ్ లో ధన్ ఖడ్ కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ను జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ లోక్ సభలో ఏదైన నోటీస్ వచ్చిందా అని అడిగి , ఆ సమాచారం రాజ్యసభకు పంపించాలని కోరారు.
ఆశ్చర్యపోయిన మేఘ్ వాల్ లేచి నిలబడి సందేహంగా సమాధానం ఇచ్చారు. లోక్ సభలో అటువంటి నోటీస్ కు కనీసం వంద మంది ఎంపీల సంతకాలు అవసరమా అని మరో ప్రశ్నను ధన్ ఖడ్ న్యాయమంత్రిని అడిగారు.
దానిని మేఘ్ వాల్ సమాధానమిస్తూ అవును వంద కాదు 152 అని సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాల నోటీస్ పై అవసరమైన చర్యలను ప్రారంభించడానికి రాజ్యసభ సెక్రటరీ జనరల్ ‘‘అవసరమైన చర్యలు తీసుకుంటారని’’ ఉపరాష్ట్రపతి సభకు తెలియజేశారు.
పరిణామాల క్రమం..
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దిగువ సభలో కేంద్రం మద్దతు ఇచ్చిన నోటీస్ ను అంగీకరించినట్లు తెలిసినట్లుగా ధన్ ఖడ్ కూడా ప్రతిపక్ష నోటీస్ ను అంగీకరించడంతో జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు ప్రక్రియను ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభలు సంయుక్తంగా నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరిశంశ్ నారాయణ్ సింగ్ తో ప్రారంభం అవుతుంది. రాజ్యసభ తాత్కాలిక లేదా పూర్తి సమయం చైర్మన్ ను నియమించే వరకూ ఆయనే రాజ్యసభ వ్యవహరాలు నడిపిస్తూ ఉంటారు. జస్టిస్ వర్మ పై వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేసే ముగ్గురు సభ్యులను సంయుక్తంగా నిర్ణయించారు.
ధన్ ఖడ్ చర్య వల్ల సంభవించిన పరిణామాల గొలుసు ఇప్పుడు కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయింది. తీవ్రమైన అవినీతి ఆరోపణలు, దుష్పవర్తన, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిపై జాతీయ ప్రయోజనాల కోసం చర్య తీసుకునే పార్టీ రాజకీయాల పరిధిలో ఇప్పుడు లేదు.
ప్రభుత్వ ప్రణాళికను పక్కదారి పట్టించడం ధన్ ఖడ్ ఉద్దేశం కాకపోవచ్చు. కానీ న్యాయ వ్యవస్థ ను నియంత్రించడం కోసం ఆయన చేస్తున్న వ్యక్తిగత పోరాటం, ఆయన రాజ్యసభ్యకు చైర్మన్ గా తొలిసారిగా అధ్యక్షత వహించిన రోజు నుంచి స్పష్టంగా కనిపిస్తోంది.
2015 లో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినందుకు ఆయన అత్యున్నత న్యాయ వ్యవస్థ ను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంలోని అగ్రశ్రేణి సంస్థలు సహించలేని ఒక సరిహద్దును ఆయన దాటేలా చేసి ఉండవచ్చని కొన్ని వర్గాలు చెబుతున్న మాట.
సోమవారం సాయంత్రం ధన్ ఖడ్ ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పార్లమెంటరీ వ్యవహరాలను చూసుకునే కిరణ్ రిజుజూ గైర్హాజరు కావడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
ఆపరేషన్ సిందూర్ పై చర్చకు అనుమతిస్తూ బీజేపీ ఎంపి నమిక్ భట్టాచార్య కు ధన్ ఖడ్ ఇచ్చిన నోటీస్ ను ఎలా కొనసాగించాలనుకుంటున్నారో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చించడానికి ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేవలం ప్రతిపక్ష నాయకులు మాత్రమే హజరయ్యారని వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్..
రాజ్యసభ చైర్మన్ గా పార్లమెంట్ సమావేశంలో పాల్గొనడం కంటే ఉపాధ్యక్షుడిగా ధన్ ఖడ్ భవిష్యత్ లో చాలా బిజీగా ఉండబోతుందనేది సుస్పష్టం. కానీ ఆయన రాజీనామా అనారోగ్య కారణాలు మాత్రం కావు. ఇతర కారణాలు ఉన్నాయనే సందేహాలు వస్తున్నాయి.
నిజానికి సోమవారం మధ్యాహ్నం 3.53 గంటలకు ఉపరాష్ట్రపతి సచివాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. భారత్ లోని ప్రయివేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత సంస్థ అయిన క్రెడాయ్ కొత్తగా ఎన్నికైన సభ్యులతో మాట్లాడటానికి జూలై 23న ఆయన జైపూర్ కు వెళ్తున్నారని వెల్లడించింది.
గత ఏడాది డిసెంబర్ లో ఆయన ఎయిమ్స్ లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ అదే నెలలో తన అధికారిక కార్యక్రమాలను తిరిగి ప్రారంభించారు.
రెండు నెలల తరువాత మహాకుంభ్ లో పాల్గొన్నారు. ఆయన క్రమం తప్పకుండా ప్రజా కార్యక్రమాలకు హజరవుతూనే ఉన్నారు. ఎక్కడా వేగం తగ్గకుండా దూసుకుపోతున్నప్పటికీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజు తరువాత అకస్మాత్తుగా తన ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకుని రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ప్రకటించిన తరువాత చాలామంది మదిలో మెదిలిన ప్రశ్న ఇది.
మోదీ చీర్ లీడర్
జస్టిస్ వర్మ కేసులో ధన్ ఖడ్ అతిగా వ్యవహరించడం చాలా చిన్న విషయమని, కేంద్రం ఆయనపై నమ్మకం కోల్పోవడానికి, చికాకు కలిగించడానికి వేరే కారణాలు ఉన్నాయని నమ్మే రాజకీయా నాయకులు చాలా మంది ఇరువైపులా ఉన్నారు.
గత మూడు సంవత్సరాలుగా ధన్ ఖడ్ ప్రధాన మంత్రికి అత్యంత ఆప్తుడైన మిత్రులలో ఆయన ఒకరు. ఆయన సభా వ్యవహరాలను పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శించారు.
ఈ ప్రక్రియలో ఆయనపై ప్రతిపక్షం మొదటి సారిగా తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నించింది. ఇది భారత దేశ చరిత్రలోనే మొదటిది. అయితే ఈ తీర్మానాన్ని హరివంశ్ తిరస్కరించారు. ఆయనే ఇప్పుడూ ఎగువ సభ తాత్కాలిక చైర్మన్ గా ధన్ ఖడ్ స్థానంలో నియమితులవుతున్నారు.
నిశ్శబ్దంగా ప్రభుత్వం..
ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రభుత్వం నిశ్శబ్ధమే సమాధానమైంది. ఈ చర్యపై ప్రధాని మోదీ సహ ఏ కేంద్రమంత్రి మాట్లాడలేదు. ఆయన నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలనే విజ్ఞప్తులు రాలేదు.
కనీసం ఆరోగ్యం బాగుపడాలనే కోరిక కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేయలేదు. ఆయన మొదటి వరుసలోనే ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వైద్యుల సలహ మేరకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామాను ఆయన ఇంకా పొడిగించలేదు.
కేంద్రానికి విరుద్దంగా ఏడు నెలల క్రితం ఆయనపై అభిశంసన నోటీస్ ఇచ్చిన విపక్షాలు మాత్రం ఆయన చర్యను పున: పరిశీలించుకోవాలని పూర్తి స్థాయిలో ఒత్తిడి తెచ్చింది.
పాత్ర రిహార్సల్..
‘‘ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఆకస్మిక రాజీనామా వివరించలేని విధంగా దిగ్భాంతికరమైనది. నేను ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకూ అనేక మంది ఎంపీలతో పాటు ఉన్నాను. రాత్రి 7.30 నిమిషాలకు ఆయనతో ఫోన్ లో మాట్లాడాను. ఆయన రాజీనామాలో కంటికి కనిపించే దానికంటే ఏదో ఉంది. ఇది ఊహగానాలకు సమయం కాదు.
మిస్టర్ ధన్ ఖడ్ ప్రభుత్వం, ప్రతిపక్షాలను సమానంగా విమర్శించారు. ఆయన రేపు మధ్యాహ్నం 1 గంటలకు వ్యాపార సలహ కమిటీ సమావేశాన్ని నిర్ణయించారు. ఆయన రేపు న్యాయ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ప్రధాన ప్రకటనలు కూడా చేయనున్నారు’’ అని జైరాం రమేష్ తన ఎక్స్ పోస్ట్ లో ట్వీట్ చేశారు. 
ధన్ ఖడ్ తరుచుగా మందలించే మరో ప్రతిపక్ష నాయకుడు సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా రాజీనామాపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఇది ఆరోగ్యం వల్ల కాదు. ఇంకా ఏదో ఉంది’’ అని రమేష్ చెప్పిన దానితో ఏకీభవించారు. పేరు చెప్పడానికి తృణమూల్ ఎంపీ ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని దుర్మార్గపు పనులను సమర్థించడంలో ఆయన విసిగిపోయి ఉంటారు’’ అన్నారు.
ప్రక్రియ..
ఆర్టికల్67(ఏ) ప్రకారం.. ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలగడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. రాష్ట్రపతిని ఉద్దేశించి ఆయన చేతితో రాసిన రాజీనామా సరిపోతుంది. ఆర్టికల్ 68(1) ప్రకారం ఖాళీగా ఉన్న పదవిని భర్తీ చేయడానికి ఆయన పదవీకాలం ముగిసే వరకూ ఎన్నిక పూర్తి చేయాలి.
ఆర్టికల్ 68(2) ప్రకారం అత్యవసరంగా ఖాళీలు ఏర్పడితే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికైన కొత్త ఉపరాష్ట్రపతి తన పదవి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు.
Tags:    

Similar News