పత్రికా స్వేచ్ఛపై పంజాబ్, హర్యానా కోర్టు ఏం చెప్పింది?
ఓ ఉన్నతాధికారి జర్నలిస్టుపై వేసిన పరువునష్టం వ్యాజ్యాంపై విచారించిన పంజాబ్, హర్యానా కోర్టు ఏ విధంగా స్పందించింది? పాత్రికేయులకు భరోసా నిచ్చిందా?
పంజాబ్, హర్యానా హైకోర్టు ఇటీవల చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వాక్, పత్రికా స్వేచ్ఛను సమర్థించింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టుకు సంబంధించిన క్రిమినల్, పరువు నష్టం కేసులో కోర్టు తీర్పు చెప్పింది.
హర్యానాకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి వేసిన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. జర్నలిజం పవిత్రతను నిలబెట్టింది. జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించింది. హానికర పరిణామాలకు పాత్రికేయులు భయపడకుండా వార్తలను ప్రచురించడానికి భరోసానిచ్చింది.
సమాజానికి ప్రాతినిధ్యం వహించడానికి, సత్య శోధనకు జర్నలిజం ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది.
ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం మీడియా..
ప్రజాస్వామ్యానికి జర్నలిజం చాలా ముఖ్యమని కోర్టు పేర్కొంది. అయితే జర్నలిస్టులు నిజాన్ని వెలికితీసే క్రమంలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు అంగీకరించింది.
“రిపోర్టర్ల పవిత్ర కర్తవ్యం పౌరుల పట్ల విధేయతగా ఉండడం. ప్రజా ప్రయోజనం కోసం సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజా వ్యవస్థ పనితీరు, సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తారు. ధైర్యవంతులైన జర్నలిస్టులు వాస్తవాలను బయటపెట్టినపుడు కొంతమంది వ్యక్తులు లేదా ప్రభుత్వ సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారని" హైకోర్టు పేర్కొంది.
తీర్పు హర్షణీయం..
తీర్పుపై ప్రముఖ పాత్రికేయుడు, రచయిత మనోజ్ మిట్టా వంటివారు హర్షిస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు ఇప్పుడు ప్రభుత్వ, ప్రభుత్వేతర సమూహాల నుంచి ముప్పు ఎదుర్కొంటున్నారని, వారి ఉద్యోగం ప్రమాదకరంగా మారుతోందన్నారు. ప్రస్తుత వాతావరణంలో ఇప్పటికీ వాచ్‌డాగ్ జర్నలిజంను అభ్యసిస్తున్న వారికి ఈ తీర్పు మనోధైర్యాన్నిస్తుందన్నారు. "ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జవాబుదారీగా ఉన్న వ్యక్తికి రక్షణ కల్పించడాన్ని తీర్పు నొక్కి చెబుతుందని ఢిల్లీ, గుజరాత్ అల్లర్లపై పుస్తకాలు రాసిన కాస్ట్ ప్రైడ్ రచయిత మిట్టా చెప్పారు. .
వాక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడంలో సుప్రీం కోర్టు తగినంతగా చేయడం లేదని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. “ఇది చాలా మంచి తీర్పు. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. తీర్పు జర్నలిస్టులకు ఖచ్చితంగా దోహదపడుతుంది.’’ అని పేర్కొన్నారు.
వాక్ స్వాతంత్య్రంలో ముఖ్యమైన భాగంగా పత్రికా స్వేచ్ఛను రాజ్యాంగం పరిరక్షిస్తుంది. సమర్థిస్తుంది కూడా. హైకోర్టు తీర్పు పాత్రికేయుల రక్షణను బలపరుస్తుంది” అని చండీగఢ్‌లోని పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయవాది అమన్ ప్రీత్ సింగ్ చెప్పారు.
“ఇది స్వాగతించదగ్గ తీర్పు. ఈ కేసులో దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే.. క్రిమినల్, పరువునష్టం కేసులు పోలీసులే దాఖలు చేశారు. మీకు తెలుసా. ప్రభుత్వం లేదా పోలీసులు జర్నలిస్టులపై పరువు నష్టం కేసులను నమోదు చేయకూడదు. వారు కఠిన చర్యలు తీసుకోవచ్చు లేదా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించవచ్చు. జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో న్యాయస్థానం చాలా దూరం వెళ్లగలదని భావిస్తున్నాను” అని ఢిల్లీకి చెందిన జర్నలిస్టు అభిసార్ శర్మ పేర్కొన్నారు.
దేశంలోని జర్నలిస్టులు నేడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శర్మ నొక్కిచెప్పారు. 2020లో దళిత బాలికపై జరిగిన అత్యాచారం, హత్యను కవర్ చేయడానికి హత్రాస్‌కు వెళుతున్నప్పుడు UAPA కింద ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన కేరళ జర్నలిస్ట్ సిద్ధీక్ కప్పన్ కేసును ఉదహరించారు. కప్పన్ బెయిల్ పొంది జైలు నుంచి రావడానికి రెండేళ్లు పట్టింది.
క్రూరమైన చట్టాలు..
“కేరళ జర్నలిస్ట్ సిద్ధీక్ కప్పన్ UAPA కారణంగా జైలులో ఉన్నారని మర్చిపోవద్దు. అలాగే న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ కూడా ఉగ్రవాదులపై యుఎపిఎ ఆరోపణలపై జైలులో ఉన్నారని శర్మ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశాలను శర్మ ప్రశ్నించాడు. దేశ వ్యతిరేక అంశాల కోసం ఉద్దేశించిన కఠిన చర్యలను జర్నలిస్టులపై ప్రయోగించడాన్ని తప్పుబట్టారు. NewsClick కేసులో కూడా వారు ఇప్పటికీ ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పారు.
సమాచార స్వేచ్ఛను కాపాడటం కోసం పనిచేసే పారిస్‌కు చెందిన లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) ప్రకారం.. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం 140వ స్థానంలో నిలిచింది. 2013లో దేశంలో హత్యకు గురైన జర్నలిస్టుల సంఖ్య 8 అని ఆర్‌ఎస్‌ఎఫ్ పేర్కొంది. అంతకు ముందు పత్రికా స్వేచ్ఛ సూచికలో మన దేశం 136వ స్థానంలో ఉంది.
2014లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో పత్రికా స్వేచ్ఛ క్రమంగా క్షీణించింది. జర్నలిస్టులు తరచుగా ప్రభుత్వ నిర్బంధాలు, ప్రభుత్వేతర వ్యక్తుల దాడులకు బాధితులుగా మారుతున్నారు. ఫలితంగా పరిస్థితులు దిగజారడం ఆందోళన కలిగిస్తుంది. 2018లో గౌరీ లంకేశ్, గతేడాది ఫిబ్రవరిలో శశికాంత్ వారిషే వంటి జర్నలిస్టులను పట్టపగలు హత్య చేయడమే ఇందుకు నిదర్శనం.
RRAG నివేదిక ఏం చెబుతోంది..
రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ (RRAG) నివేదిక ప్రకారం.. జర్నలిస్టులకు భారతదేశం ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది. జర్నలిస్టులు ప్రభుత్వం లోపల, వెలుపల శక్తివంతమైన సమూహాల నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
2017లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై జరిగిన నిర్బంధాన్ని 2022లో జర్నలిస్టులపై దాడికి వ్యతిరేకంగా కమిటీ ఇచ్చిన నివేదిక వివరిస్తుంది. నివేదిక ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో 12 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. 48 మంది జర్నలిస్టులపై భౌతిక దాడులు జరిగాయి. 66 మంది జర్నలిస్టులను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టుకు కారణం ఏదైనా కావచ్చు. మధ్యాహ్న భోజనం లేదా అత్యాచారం గురించి నివేదించడం కూడా కావచ్చు. 2019లో మిర్జాపూర్‌కు చెందిన పవన్ జైస్వాల్ అనే జర్నలిస్టును యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి బదులు రోటీ, పప్పు మాత్రమే అందిస్తున్న వైనాన్ని బయటపెట్టారు. 2022 ఫిబ్రవరిలో ఇద్దరు దళిత బాలికలపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి నివేదించిన పితోరాఘర్‌కు చెందిన దళిత జర్నలిస్టు కిషోర్ రామ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు.
EGI కూడా ఆ శక్తి లేకపోవచ్చు..
దేశంలోని జర్నలిస్టుల అత్యున్నత సంస్థ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (EGI) కూడా కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తగిలిన సందర్భాలున్నాయి. జాతి హింసను పరిశోధించడానికి EGI ఒక బృందాన్ని మణిపూర్‌కు పంపి నివేదికను బయటపెట్టింది. అయితే మణిపూర్ పోలీసులు జట్టు సభ్యులు , ఈజీఐ నాయకులపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే జైలులో ఉండేవారు.
జర్నలిస్టులను హత్య చేసిన సందర్భాలున్నాయి. అర్ధరాత్రి దాడుల్లో జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన సమయాలూ ఉన్నాయి. అలాంటి వారిలో బీబీసీ మాజీ పాత్రికేయుడు వినోద్ వర్మ ఒకరు. జర్నలిస్టుల కార్యాలయాల్లో సోదాలు చేసి పోలీసులు తరచూ ఫోన్లు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు. ఈ సంఘటనలు చాలా అసాధారణం కాదు. వాటికి వివరణాత్మక చర్చ అవసరం.
1992, 2023 మధ్య దేశంలో 91 మంది జర్నలిస్టులు, మీడియా పర్సన్స్ హత్యకు గురయ్యారు.
ఎస్సీ దానిని అనుసరిస్తుందా?..
పరిస్థితి మరింత దిగజారుతోంది. ఎటువంటి మెరుగుదల కనిపించడం లేదు. పత్రికా స్వేచ్ఛ సూచీలో భారతదేశం మరింత దిగజారడంలో ఆశ్చర్యం లేదు. 180 దేశాలలో 161వ స్థానంలో ఉన్న భారతదేశం, దేశంలో ప్రజాస్వామ్య సామర్థ్యాన్ని కొలిచే సూచికలో పాకిస్తాన్ కంటే ఏడు స్థానాలు తక్కువగా ఉంది.
కానీ పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇటీవలి నిర్ణయం జర్నలిస్టులను రక్షించడానికి, ప్రతికూల పరిణామాలకు భయపడకుండా పని చేసేలా సుప్రీంకోర్టు నడిపించగలదా? లేక న్యాయవాది భూషణ్ సూచించినట్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విస్మరిస్తుందా?