బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసిన నటి ..

నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు.

Update: 2024-05-01 09:04 GMT
లోక్‌సభ మూడో దశ ఎన్నికలకు ముందు నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే గంగూలీని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. గురువారం (మే 1న) ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో ఆమె సమావేశమయ్యారు. ఫరూఖాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) నాయకురాలు మారియా ఆలం పోటీపడుతున్నారు. బీజేపీ తరుపున రూపాలీ గంగూలీ ఫరూఖాబాద్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.
మారియా ఆలం "ఓటు జెహాద్" అంటూ ప్రచారం చేయడంపై తావ్డే స్పందిస్తూ.. "అబద్ధాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు ఇప్పుడు 'ఓటు జెహాద్' ప్రచారాన్ని ప్రారంభించాయి. ఒకవైపు ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తూనే మరోవైపు ఎన్నికల సమయంలో ‘ఓటు జెహాద్’ అంటూ మాట్లాడుతున్నారు. పార్టీ హైకమాండ్ సూచన మేరకే ‘ప్రచారం’ ప్రారంభించారా ? అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీని తావ్డే ప్రశ్నించారు.
ఎవరీ రూపాలీ గంగూలీ..
రూపాలీ గంగూలీ దర్శకుడు అనిల్‌ గంగూలీ కూతురు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై పలు టీవీ సీరియళ్లలో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై అత్యధికంగా పారితోషకం అందుకుంటున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే.. బెంగాలీ మూలాలున్న కుటుంబమే అయినప్పటికీ రూపాలీ సినీ నేపథ్యం కారణంగా ఆమె తండ్రి ముంబైలో స్థిరపడ్డారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసి ఆపై నటన వైపు ఆమె మళ్లారు. 2013లో ఆమె అశ్విన్‌ వీ వర్మ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.
ఇటీవల బీజేపీలో చేరిన నటి కంగనా రనౌత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే రామ్‌నివాస్‌ రావత్‌ మంగళవారం బీజేపీలో చేరారు.
Tags:    

Similar News