’గాంధీ’ పేరును వాడుకునే అర్హత రాహుల్‌కు లేదని అన్నదెవరు?
జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పేరులోని చివరి ‘గాంధీ’ పేరును వాడుకునే అర్హత రాహుల్‌కు లేదని అన్నారు కేరళ ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యే పివి అన్వర్. ఆ తర్వాత ఏమైంది?
కేరళలో ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యే పివి అన్వర్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఏప్రిల్ 22న జరిగిన ఎన్నికల సభలో అన్వర్ ప్రసంగించారు. రాహుల్ గాంధీ నాల్గవ తరగతి పౌరుడని పేర్కొంటూ.. రాహుల్‌ను గాంధీ ఇంటిపేరుతో పిలిచే అర్హత లేదని, ఆయనకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యే అన్వర్‌పై ఏప్రిల్ 26, నట్టుకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. IPC సెక్షన్ 153A (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 (ఎన్నికలకు సంబంధించి తరగతుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద కేసు కట్టారు. న్యాయవాది బైజు నోయెల్ రోసారియో దాఖలు చేసిన ఫిర్యాదుపై కోర్టు విచారించింది. అన్వర్ పై కేసు నమోదు చేయాలని పోలీసులకు న్యాయమూర్తి సూచించారు.
కాగా ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను విజయన్ సమర్థించారు. కాంగ్రెస్ నాయకుడు విమర్శలకు అతీతుడు కాదని పేర్కొన్నారు.