భారతీయుడిని వరించిన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అవార్డు

వ్యవసాయ ఆర్థిక వేత్త, ఒడిశాకు చెందిన సమరేందు మొహంతికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అవార్డు ప్రకటించింది. వ్యవసాయ రంగంలో విశేష సేవలందించినందుకు ఆయనను..

Update: 2024-08-28 09:49 GMT

భువనేశ్వర్ కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నిఫుణుడు అయిన సమరేందు మొహంతీని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ 2024 టాప్ అగ్రి-ఫుడ్ పయనీర్‌గా ప్రకటించింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌లో పనిచేస్తున్న గ్లోబల్ ట్రైల్‌బ్లేజర్‌లను గుర్తించే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ తన 38 వ వార్షికోత్సవంలో భాగంగా ఈ సంస్థ ఎంపిక చేసిన వ్యక్తుల జాబితా రూపొందించింది.

ఈ సంస్థ 20 దేశాలు, 6 ఖండాల నుంచి 38 మంది డూ-ఎర్స్‌లను ప్రతి సంవత్సరం గుర్తిస్తుంది. అనంతరం వీరిని ఈ ఏడాది అక్టోబర్ 29-31 న USAలోని డెస్ మోయిన్స్‌లో జరిగే 2024 బోర్లాగ్ డైలాగ్‌లో ట్రైల్‌బ్లేజర్‌లను సత్కరిస్తుంది.

డాక్టర్. మొహంతి అంతర్జాతీయ అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధిలో విశేష అనుభవం ఉన్న వ్యవసాయ ఆర్థికవేత్తగా గుర్తింపు పొందారు. అతని 30 సంవత్సరాల కెరీర్‌లో ఉత్తర అమెరికా, ఆసియాలో వ్యవసాయ విధాన రూపకర్తలతో విస్తృతంగా పనిచేశాడు.
మొహంతి అనేక ఆసియా దేశాల రైతులతో కలిసి వారి జీవనోపాధిని మెరుగుపరచడంలో వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. ముఖ్యంగా మనదేశంలోని ఒడిశాలో చిన్న రైతుల పెద్ద క్షేత్రం (SFLF) వ్యవసాయ నమూనాను ప్రవేశపెట్టాడు. చిన్న రైతులు వ్యవసాయ ఉత్పాదక ఖర్చులను తగ్గించుకోవడానికి, ఇన్‌పుట్ - అవుట్‌పుట్ ల కోసం ఒక బృందంగా ఏర్పడి కొనుగోలు చేయడం ద్వారా లాభాలు సంపాదించవచ్చని అవగాహన కల్పించారు.
ఈ విధానం చిన్న రైతులను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ఖర్చును తగ్గించుకోవడానికి, సమకాలీకరణ ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వీలు కల్పిచింది. ఒడిశాలో ప్రారంభమైన SFLF తరువాత అనేక రాష్ట్రాలకు విస్తరించింది. అలాగే 2019 లో విత్తన ఖర్చులను తగ్గించడానికి, చిన్న రైతులను వారి విత్తన అవసరాలలో స్వయం సమృద్ధిగా మార్చడానికి నడుంబిగించాడు.
తక్కువ-ధరలో బంగాళాదుంప విత్తనోత్పత్తి చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఎపికల్ రూటెడ్ కటింగ్ (ARC) ను ప్రవేశపెట్టాడు. ARC సాంకేతికత భారతదేశంలోని అనేక బంగాళాదుంపలను పండించే రాష్ట్రాలలో విస్తరించింది. ఈ తక్కువ-ధర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బంగాళాదుంప విత్తన ఉత్పత్తిని వికేంద్రీకరించడం వల్ల విత్తన ధరను 25-50% తగ్గింది. దీనివల్ల ఉత్పాదక ఖర్చులు తగ్గి రైతులకు లాభాలు మిగిలాయి.


Tags:    

Similar News