ఇండోనేషియాలోని బాలిలో ప్రపంచ చేనేత దినోత్సవం

ప్రపంచ వీవర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఇండోనేషియాలోని బాలిని ఎందుకు ఎంచుకున్నారు

Update: 2023-12-16 13:14 GMT
జాతీయ చేనేత దినోత్సవం వ్యవస్థాపకుడు వై. వెంకన్న నేత

ప్రపంచ వీవర్స్ కాన్ఫరెన్స్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 న  ఇండోనేషియా లోని బాలీ ద్వీపంలో నిర్వహిస్తున్నారు. దీనికి హైదరాబాద్ కు చెందిన చేనేత  నిఫుణుడు వై వెంకన్న నేత సాధ్యం వహిస్తున్నారు. ఈ మహాసభ బాలీలో ఎందుకు నిర్వహిస్తున్నారో ఆయన ఈ రోజు వివరించారు.

ఇండోనేషియా, భారతదేశం మధ్య  గొప్ప చారిత్రక సాంస్కృతిక సంబంధాలున్నాయని ఆదేశంలోని  బాలి శక్తివంతమైన కళలు సాంప్రదాయ చేతిపనులకు ప్రసిద్ధి చెందిందని చెబుతూ చేనేత  ప్రపంచంలో, విశిష్టమయిన  ఇకత్   ఇక్కడే  పుట్టి అనేక దేశాలకు విస్తరించినందున, సభకు ఇదే అనువైన వేదికగా భావించడం జరిగిందని వెంకన్న చెప్పారు. 

‘‘ముడి, కట్ట నూలు అనే అర్థం వచ్చే ఇండోనేషియా పదం ‘ఇకాత్’   నుంచి వచ్చిందే మనం ఇకత్ నేత.  ఈ కళారూపంతో భారతీయ  చేనేత సంప్రదాయాలతో దృఢమయిన  చారిత్రక సంబంధం ఉంది,’’ అని చెబుతూ ఈ విషయాన్ని సంస్మరించుకోవడం అవసరం అని ఆయన అన్నారు.

 భారతదేశంలోని పోచంపల్లి సంబల్‌పూర్ వంటి ప్రాంతాలు ఇకత్ కళారూపాన్ని స్వీకరించి భారతీయ చేనేత వైవిధ్య భరితం చేశాయని ఆయన చెప్పారు.

ఈ ఇకత్ సంప్రదాయాన్ని సంరక్షించడానికి, ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రపంచ వీవర్స్ కాన్ఫరెన్స్ వేదిక గా పని చేస్తుందని,   బాలిని ఈ వేదిక కావడం  వెనక ఈ కళారూపానికి   నివాళులర్పించాలన్న లక్ష్యం ఉందని అన్నారు.

‘‘సహజ సిద్ధ రంగుల వాడకంతో ఇకత్ భారతీయ నేత లో  ప్రతిఫలిస్తుంది.మరొక విశేషం ఏమిటంటే,  భారతదేశం ఇండోనేషియాలోని నేత కమ్యూనిటీలలో సాధారణ గోత్ర నామం మార్కండేయ  ఉండటం.  ఇది భారత్, ఇండోనేషియా  పూర్వీకుల మధ్య కొనసాగిన చేనేత అనుబంధాన్ని సూచిస్తుంది. ఇపుడు రెండు దేశాల మధ్య నాటి  సాంస్కృతిక వారధిని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం నొక్కిచెబుతుంది,’’ అని ఆయన చెప్పారు.

"వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్‌ను బాలికి తీసుకురావడం ద్వారా, ఈ చారిత్రక సంబంధాలను నెమరేసుకోవడం, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడం, నేత రంగంలో ప్రపంచ సహకారానికి వేదికను అందించాలనేవి లక్ష్యంగా పెట్టుకున్నాము. బాలి  గొప్ప సంప్రదాయాలు, ఇకత్ కళ పట్ల అక్కడి ప్రజల  అంకితభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది," అని వెంకన్న తెలిపారు. 

Similar News