మరోసారి ఢిల్లీకి అదే గుర్తింపు.. ప్రపంచంలోనే..

భారత ఉపఖండం మొత్తం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఢిల్లీ ఈ జాబితాలో ఉండగా, తాజాగా బిహర్ లోని మరో ప్రాంతం కూడా ఇందులో చేరింది

Update: 2024-03-19 07:03 GMT

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య, తక్కువ గాలి నాణ్యత కలిగిన నగరంగా ఢిల్లీ మరోసారి వార్తల్లోకెక్కింది. 2023 నివేదిక ప్రకారం, ఢిల్లీ ఈ జాబితాలో చేరింది. రెండోస్థానంలో బిహార్ లోని బెగుసరాయ్ అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ ప్రాంతంగా అవతరించింది. స్విస్ సంస్థ IQ Air విడుదల చేసిన గణాంకాల్లో అత్యంత తక్కువ వాయునాణ్యత కలిగిన దేశాల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో బంగ్లాదేశ్, రెండో ప్లేస్ లో పాకిస్తాన్, మూడో స్థానంలో భారత్ ఉంది.

ఉపఖండం ఉక్కిరిబిక్కిరి
భారతదేశం సగటు వార్షిక పీఎం( పర్టి క్యూలేట్ మ్యాటర్) 2.5 సాంద్రతగా, అంటే ప్రతి క్యూబిక్ మీటరుకు 54.4 మైక్రోగ్రాములుగా ఉంది, బంగ్లాదేశ్ క్యూబిక్ మీటరుకు 79.9 మైక్రోగ్రాములతో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్ క్యూబిక్ మీటరుకు 73.7 మైక్రోగ్రాములతో రెండవ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది ఇదే జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది.
క్యూబిక్ మీటరుకు సగటున 118.9 మైక్రోగ్రాముల PM 2.5 గాఢతతో బెగుసరాయ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా అత్యంత చెత్త రికార్డును సాధించింది. ఈ నగరం 2022 లో ర్యాంకింగ్స్‌లో లేనేలేదు. ఒక్క ఏడాదిలోనే అతి అత్యంత చెత్త మెట్రోపాలిటన్ నగరంగా మారింది. జాతీయ రాజధాని అయిన ఢిల్లీ 2018 నుంచి నాలుగు సార్లు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా ఈ జాబితాలో ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యూబిక్ మీటర్ కు 5 మైక్రో గ్రాముల మించి ఒక ఏడాదికి పీల్చకూడదని పలు సందర్భాల్లో సూచించింది. కానీ దేశంలో దీని కంటే ఏడు రెట్లు ఎక్కువగా అంటే పీఎం 2.5 స్థాయిగా ఉండదని పలునివేదికలు తెలియజేస్తున్నాయి. దేశంలోని 66 శాతం కంటే ఎక్కువ నగరాలు వార్షిక సగటు క్యూబిక్ మీటర్‌కు 35 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదించాయి.
IQAir ఈ నివేదికను 30,000 కంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశోధన సంస్థలు విశ్వవిద్యాలయాల వంటివి సేకరించిన వాటి నుంచి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి తొమ్మిది మరణాలలో ఒకటి వాయు కాలుష్యం సంభవిస్తోందని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఏడాది ఏడు మిలియన్ల మంది వాయుకాలుష్యం వల్ల మరణిస్తున్నారని డబ్ల్యూ హెచ్ ఓ అంచనావేస్తోంది.
PM 2.5 వాయు కాలుష్యానికి గురికావడం వలన ఆస్తమా, క్యాన్సర్, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధులతో సహా అనేక అనారోగ్య పరిస్థితులకు కారణం అవుతున్నాయి. వీటితో పిల్లల అభివృద్దికి దారితీస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా పెంచుతుంది. మధుమేహంతో సహా ఇప్పటికే ఉన్న అనారోగ్యాలను క్లిష్టతరం చేస్తుంది
Tags:    

Similar News